‘శుభం’ ట్రైలర్.. ఊహించ‌ని పాత్ర‌లో స‌మంత.. అద‌ర‌గొట్టేసిందిగా..!

స్టార్ హీరోయిన్ సమంత ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో హీరోయిన్గా సినిమాలు తగ్గించేసిన ఈ ముద్దుగుమ్మ.. ట్ర‌లాల మూవీంగ్‌ పిక్చర్స్ బ్యానర్ను స్థాపించి నిర్మాతగా మారింది. ప్రస్తుతం ప్రొడ్యూసర్‌గా తన పనుల్లో బిజీగా గడుపుతున్న సామ్.. శుభం సినిమాను రూపొందించింది. రాజ్ నిడ‌మొరు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా.. మే 9న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో తెగ సందడి చేస్తున్నారు టీం.

Samantha's Subham to grace big screens on...

ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగానే కొద్ది నిమిషాల క్రితం శుభం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు టీం. ఈ ట్రైలర్‌లో కథ‌ ఏంటో సింపుల్ గా ఆడియన్స్‌లో ఆసక్తి కల్పించేలా చెప్పే ప్రయత్నం చేశారు. ఊర్లోని మహిళలంతా రాత్రి 9 గంటలు దాటితే వచ్చే సీరియల్‌కు ఎడిక్ట్ అయిపోతున్నారు. ఆ సీరియల్ చూస్తూ దెయ్యాలా మారిపోతున్నారు. ఇంట్లో మగాళ్ళకి రక్షణ కరువైపోయింది. ఆ తర్వాత ఓ మాత‌ రోల్‌లో సమంత కనిపించింది.

ఇంతకీ సమంతా ఈ మాత‌ గెటప్‌లో ఏం చేయనుంది.. సమంత కథను ఏదైనా మలుపు తిపుతుందా.. అసలు మహిళలంతా అలా ఎందుకు మారిపోతున్నారు అన్న ఆసక్తికర పాయింట్లు సినిమాల్లో చూపించనున్నారు. ఇక ఇందులో సమంత స్పెషల్ అపీరియన్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ట్రైలర్‌లో మాత్రం సమంత డైలాగ్స్ లేకుండా సైగలతో మెప్పించింది. ప్రొడ్యూసర్ గానే కాకుండా.. నటిగాను శుభం సినిమాల్లో సమంత మెరవడం ఫ్యాన్స్‌కు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ మూవీకి ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్స్ తెచ్చుకుంటుందో వేచి చూడాలి.