ఒక్క సినిమాలోనే 30 లిప్‌లాక్ ల‌తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి సక్సెస్ సాధించి.. స్టార్ హీరోయిన్‌ ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడం సాధారణ విషయం కాదు. ఎన్నో ఇబ్బందులు, సమస్యలు, అహర్నిశలు శ్రమిస్తేనే స్టార్ స్టేటస్ దక్కుతుంది. అలా ఇండ‌స్ట్రీలో స‌క్స‌స్ సాధించిన హీరోయిన్‌ల‌లో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా ఒక‌టి. మొదట బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అమ్మడు.. తర్వాత టాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. తెలుగు, హిందీ భాషల్లో సినిమాలే కాదు.. మ్యూజిక్ ఆల్బమ్స్‌లోను మెప్పించింది. అయితే ఆ అమ్మ‌డుకు ఊహించిన రేంజ్‌లో సక్సెస్ రాలేదు. కానీ.. ఓకే సినిమాలో 30 లిప్ లాక్ సీన్లో నటించి ఒక్కసారిగా హైలైట్ గా మారింది. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో చెప్పలేదు కదా.. తనే సోనాల్‌ చౌహన్.

Sonal Chauhan rubbishes 30 kissing scenes with Neil Nitin Mukesh | Hindi Movie News - Times of India

2008లో జన్న‌త్‌ సినిమా ద్వారా హీరోయిన్గా ఇంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తర్వాత పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. 1987 మే 16న నోయిడాలో జన్మించిన సోనాల్.. అక్కడే ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. తర్వాత ఢిల్లీలోని గార్గి కాలేజీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. 2005 మిస్ వరల్డ్ టూరిజం టైటిల్ని సంపాదించుకుంది. ఈ అవార్డును గెలుచుకున్న తొలి ఇండియన్ ముద్దుగుమ్మ కూడా ఈమె కావడం విశేషం. తర్వాత హిమేష్ రేష్మియా మ్యూజిక్ ఆల్బమ్స్.. ఆప్కా సురార్‌లో, సంఘోనా పాటలో సోనాల్‌ మొదటిసారి మెరిసింది. ఇమ్రాన్ హష్మీ తో జన్న‌త్‌ సినిమాలోను నటించినా.. సినిమా హిట్ అయినా.. సోనాల్‌కి చెప్పు దగ్గ క్రేజ్ మాత్రం దక్కలేదు.

Sonal Chauhan | Web Stories | Manorama Online

2013లో 3g కిల్లర్ కనెక్షన్ సినిమాలోనీల్ నితిన్ ముఖేష్‌తో క‌లిసి రొమ్యాన్స్ చేసింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచినా అమ్మడుకు మాత్రం ప్లస్ అయింది. ఇందులో రికార్డ్ బ్రేకింగ్ లెవెల్ లో 30 కిస్ సీన్స్ ఉన్నాయి. గతంలో ఇమ్రాన్ హష్మీ, మల్లికా శరావత్ సినిమా మర్డర్‌లో.. 20 కిస్ సీన్లే అప్పటి వరకు హైయెస్ట్ గా ఉంది. అలాంటిది.. ఆ సినిమా 3జి కిల్లర్ కనెక్షన్ బ్రేక్ చేసి పడేసింది. ఈ క్రమంలోనే అమ్మడు హిందీతో పాటు తమిళ్, తెలుగు, కన్నడ భాషలోనూ ఆకట్టుకుంది. ఇక మొదట రెయిన్బో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ అమ్మ‌డు తర్వాత నాగార్జున, ప్రభాస్, రవితేజ, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సరసన నటించి ఆకట్టుకుంది. ఇక ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో సినిమాలతో బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్‌కు హాట్‌ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. గ్లామర్ షోతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తేనే ఉంది.