స్టార్ నటుడు కిచ్చా సుదీప్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే కిచ్చా సుదీప్‌కు అందమైన కూతురు ఉందని చాలామందికి తెలియదు. ఆయన కూతురు పేరు శాన్వి సుదీప్. ప్రస్తుతం ఆమె తన చదువుని పూర్తి చేస్తుంది. అంతేకాదు.. ఎక్స్ట్రా కర్క్యులర్ యాక్టివిటీస్‌లోను చురుక్గా సందడి చేస్తుంది. సింగింగ్ అంటే ఆమెకు చాలా ఇష్టమట. ఈ క్రమంలోనే ఎప్పటికీ పాప్ సాంగ్స్ తో కన్నడ నాట భారీ క్రేజ్ సంపాదించుకున్న శాన్వి.. భవిష్యత్తులో మంచి సింగర్ అవ్వనుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు సినిమా కోసం తన గొంతును ఇచ్చింది.
అది కూడా నేచురల్ స్టార్ నాని సినిమాకు కావడం విశేషం. నాని లేటెస్ట్ మూవీ హిట్ 3కు వాయిస్ ఓవర్ ను సాన్వి ఇచ్చింది. ఈ విషయాన్ని నాని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు. కిచ్చా సుదీప్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు. సాన్వి గొంతు బాగుంటుందని ఆమె పాప్ సాంగ్స్ అద్భుతంగా ఉంటాయట. జీ కన్నడలో సరిగమప వేదికపై.. అప్పా ఐ లవ్ యు పాటను ఎంతో చక్కగా ఆలపించి అందరినీ ఫిదా చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏకంగా తెలుగు సినిమా కోసం తన గొంతుకుని ఇచ్చింది శాన్వి. కాగా హిట్ 3 ట్రైలర్ కొద్ది రోజులు క్రితం రిలీజై ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
ఇందులో వినిపించిన బిజిఎం వాయిస్ ఓవర్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. కాగా.. తాజాగా ఈ వాయిస్ ఓవర్ కిచ్చ సుదీప్ కూతురు అంటూ నాని రివిల్ చేశాడు నాని. ఫ్యామిలీల మధ్య పరిచయం ఏర్పడడానికి కారణం ఈగ. రాజమౌళి డైరెక్షన్లో రూపొందిన సినిమాకు నాని హీరోగా కనిపించగా.. సుదీప్ విలన్ పాత్రలో మెరిసారు. ఈ సినిమా షూట్ టైంలో ఏర్పడిన పరిచయం కాస్త మంచి అనుబంధంగా మారడంతో.. ఇప్పటికి అనుబంధం కొనసాగుతున్న క్రమంలోనే హిట్ 3 కోసం సుదీప్ కూతురి వాయిస్‌ను ఉపయోగించుకున్నారట. భవిష్యత్తులో సింగర్‌గా కొనసాగేలా ప్లాన్ చేస్తుందని టాక్.