రికార్డ్ స్థాయిలో పవన్ OG బిజినెస్.. లెక్కలు చూస్తే కళ్ళుజిగేల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అంటూ ఫ్యాన్స్ క‌ళ్ళుకాయ‌లు కాచేలా ఎదురుచూస్తూన్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌జంట్ ప‌వ‌న్ న‌టిస్తున్న రెండు సినిమాలు హరి హర వీరమల్లు, ఓజిల పై మంచి క్రేజ్ నెల‌కొంది. ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఆడియ‌న్స్ చూడ‌టానికి సిద్దంగా ఉన్నారు. కాగా ఓజి బిజినెస్ లెక్క‌డ అప్డేట్ ఒక‌టి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు పవన్ నటించిన ఏ సినిమాకు లేనంత రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఓజికి జరుగుతుంద‌ని టాక్‌.

Pawan Kalyan | #OG🔥 | Instagram

అంతే కాదు.. ఓజి కంటే ముందే హరి హర వీరమల్లు రిలీజ్ కానుంది. దీని కంటే ఓజికే ఎక్కువ బిజినెస్ జరుగుతుందట. ఓజీ సినిమాపై ఇప్పటి వరకు ఏపీలో రూ.200 కోట్ల పైనే బిజినెస్ ఒప్పందాలు జరుగనున్నట్లు స‌మాచారం. ఇక ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు కానీ.. ఎప్పుడు రిలీజ్ అయినా సరే మూవీ చూడటానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. దీంతో ఓజిపై తెగ ఆసక్తి నెల‌కొంద‌ట‌. ఇక మిగతా ఏరియాలు, ఓటిటి, శాటిలైట్ హ‌క్కులని కలుపుకుంటే ఓజి బిజినెస్ భారీగానే జరిగేలా ఉందని టాక్. అలాగే హరి హర వీరమల్లు నిర్మాత కూడా భారీగానే బిజినెస్ చేయ‌నున్నారట.

Exclusive: Pawan Kalyan to resume the shoot of OG - Telugu360

ఒక్క ఏపిలోనే దాదాపు రూ.100 కోట్ల దాకా అన్ని ఏరియాలకు అమ్మనున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ న‌డుస్తోంది. దీంతో దటీజ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. రిలీజ్‌కు ముందే ఓజీ, హరిహరవీరమల్లు కాసుల వర్షం కురిపిస్తుంటే.. ఇక రిలీజై పాజిటీవ్ టాక్ తెచ్చుకుంటే బాక్సాఫీస్‌ బద్దలైనట్లే అంటూ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఇక ఈ రెండు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయ్యేది అఫీషియ‌ల్‌ ప్రకటన కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి ఓజీ, హరిహరవీరమల్లు సినిమాలు రిలీజై ఎన్ని అంచనాలను క్రియేట్ చేస్తాయో చూడాలి.