సినీ ఇండస్ట్రీలో నటులుగా అడుగుపెట్టి సక్సెస్ సాధించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక హీరోయిన్గా అడుగుపెట్టిన ముద్దుగుమ్మలకైతే.. అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. అలా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అదృష్టం కూడా కలిసొచ్చి.. వరుస సక్సెస్‌లు అందుకునే హీరోయిన్లకు ఎప్పుడు మార్కెట్ ఉంటుంది. ఈ క్రమంలోనే అలాంటి స్టార్ హీరోయిన్లను పడేయడానికి సినిమా మేకర్స్ సైతం రకరకాలుగా ప్లాన్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న టాలీవుడ్ ప్రొడ్యూసర్ కూడా ఇదే కోవకు చెందుతారు. టాలీవుడ్లో స్టార్ ప్రొడ్యూసర్ గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆయన.. ఇప్పటికే ఎన్నో సక్సెస్ లతో బోలెడు లాభాలను అందికొచ్చుకున్నాడు.
ప్రస్తుతం చేతినిండా వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు. అయితే.. ఈ ప్రొడ్యూసర్‌కు మొదటి నుంచి ఓ విక్నెస్ ఉంది. అదే హీరోయిన్లతో ఫ్రెండ్లీగా మెలగడం. వాళ్లకు ఖరీదైన గిఫ్ట్ లు ఇవ్వడం. వాళ్లు కూడా ఈ నిర్మాతను గౌరవిస్తూ ఉంటారట. అలా హీరోయిన్లను బుట్టలో పడేయడానికి.. తన వైపు తిప్పుకోవడానికి.. కాస్ట్లీ గిఫ్ట్‌లతో నిర్మాత మెల్ట్ చేస్తాడని టాక్ తెగ వైరల్ గా మారుతుంది. ఇందులో భాగంగానే ఆయన సంస్థలో సినిమా చేసిన హీరోయిన్ను ప్రస్తుతం తన చేతిలో కీలుబొమ్మగా మార్చేశాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. సినిమా ఒప్పుకోవాలన్న.. ప్రాజెక్ట్ పై సైన్ చేయాలన్న.. హీరోయిన్ ఆ నిర్మాత గైడెన్స్ తప్పనిసరిగా తీసుకుంటుందట. ఈ సినిమాచెయ్యు, ఈ సినిమాను వద్దు అని అతను చెప్తే.. దాని ప్రకారమే నడుచుకుంటుందట. అంతే కాదు ప్రొడ్యూసర్ తాజాగా దుబాయ్ వెళ్లి రూ.50 లక్షలు ఖర్చుపెట్టి మరి ఆమెకు షాపింగ్ కూడా చేశారని.
దీనితో హీరోయిన్ మరింతగా ఆయనపై ఇష్టాన్ని పెంచుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఇండస్ట్రీలో ఎక్కడైనా సరే ఓ హీరోయిన్ ను సినిమాకు ఒప్పించిన తర్వాత.. సినిమా నడుస్తున్న సమయంలో మాత్రమే నిర్మాతలు హీరోయిన్లను గారం చేస్తూ ఉంటారు. సినిమా అయిన తర్వాత వారికి రిలేషన్ ఉండదు. కానీ.. సినిమా పూర్తయిన తర్వాత కూడా నిర్మాత, హీరోయిన్ల మధ్య అలాంటి పేంపెరింగ్ రిలేషన్ కొనసాగుతుంటే సంథింగ్ ఏదో నడుస్తుందని అందరికీ అనిపిస్తుంది. ఈ హీరోయిన్ తోనే కాదు.. ఈ సంస్థలో ఏ హీరోయిన్ పనిచేసిన ఆ నిర్మాత వాళ్లను అలాగే పేంపర్ చేస్తున్నాడని.. రెమ్యూనరేషన్ కంటే ఖరీదైన గిఫ్ట్లతోనే ఎక్కువగా ఆకట్టుకుంటున్నాడని టాక్ నడుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్లను పడగొట్టడానికి ఇదో కొత్త ప్లాన్ అంటూ కామెంట్లు వైరల్‌గా మారుతున్నాయి.