నందమూరి నటసింహం బాలయ్య.. వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్‌తో బ్లాక్ బస్టర్ కొట్టి వరుసగా నాలుగు సక్సెస్లను ఖాతాలో వేసుకున్న ఆయన.. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలలో నెంబర్ వన్ పొజిషన్‌తో దూసుకుపోతున్నాడు. అఖండతో మొదలైన సక్సెస్ జర్నీ.. ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే బాలయ్య – అఖండ లాంటి బ్లాక్బస్టర్ సీక్వెల్ గా అఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూట్ సర్వే గంగా జరుగుతుంది. ఇక బాలయ్య, బోయపాటి కాంబోలో ఇప్పటివరకు మూడు సినిమాలు తెరకెక్కి.. ఒకదానిని మించి మరొకటి బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి.
ఈ క్రమంలోనే అఖండ సీక్వెల్ కావడం.. బోయపాటి డైరెక్షన్‌లో రూపొందడంతో.. సినిమాపై ఆడియన్స్ లోనూ పిక్స్ లెవెల్లో అంచనాలను నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే షూటింగ్ మొదలైనప్పటి నుంచి థియేట్రికల్ రైట్, నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో మంచి పోటీ నెలకొంది. బాలయ్య గత నాలుగు సినిమాలు ఓటీటీలో సంచలనం సృష్టించాయి. ఈ క్రమంలోనే అఖండ 2 ఓటీటీ రైట్స్ విషయంలోను గట్టి పోటీ నెలకొంది. ప్రస్తుతం ఉన్న సీనియర్ స్టార్ హీరోల ఎవ్వరికి రాని క్రేజీ ఆఫర్.. బాలయ్య సినిమాకు దక్కింది. బిగ్గెస్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లె అయినా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్ సంస్థలు ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం తలపడుతున్నాయట.
రెండు సంస్థలు కూడా రూ.100 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కానీ.. నెట్‌ఫ్లిక్స్‌కి ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ స్క్రీన్స్ ఉన్న క్రమంలో.. నిర్మాతలు, నెట్‌ఫ్లిక్స్‌కి అమ్మేందుకు మక్కువ చూపుతున్నారట. అఖండలా కాకుండా.. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. కనుక.. అన్ని వర్షన్స్ కి కలిపి 100 కోట్ల బడ్జెట్ పలుకుతున్నట్లు సమాచారం. ఇక బాలయ్య నటించిన ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఇన్ని కోట్లు పలుకుతుందని నందమూరి అభిమానులు కూడా ఊహించి ఉండరేమో. ఈ క్రమంలోనే సినిమాను వచ్చేయడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు టీం. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత.. ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. ప్రేక్షకులు అంచనాలను అందుకుంటుందో.. లేదో.. వేచి చూడలి.