ఇమాన్వీ పాకిస్తానీనే.. ప్రూఫ్‌తో దొరికిపోయిందిగా..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హనురాఘవపూడి డైరెక్షన్‌లోనూ ప్రభాస్ ఫౌజి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీలో ఇమ‌న్వీ ఇస్మాయిల్‌ హీరోయిన్గా నటించనుంది. అయితే ఇమన్వీ ఇస్మాయిల్ ఇప్పటివరకు ఏ సినిమాలోను నటించలేదు. కేవలం ఇన్‌స్టా రీల్స్ చేస్తూ హను రాఘవపూడి కంట చిక్కుకుంది. తన ఎక్స్ప్రెషన్స్, టాలెంట్ నచ్చిన హ‌నురాఘవపూడి.. హీరోయిన్గా ఇమ‌న్వీ పర్ఫెక్ట్‌గా ఉంటుందని తనను సెలెక్ట్ చేశాడట. అయితే.. కొత్త హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది అంటే.. ముఖ్యంగా ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ మొదటి సినిమాతోనే కొట్టేసిందంటే అందరిలోనూ ఆ హీరోయిన్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి నెలకొంటుంది. ఈ క్రమంలోనే ఆమె బ్యాక్ గ్రౌండ్ కూడా బయటకు వస్తూంది.

Prabhas heroine clears the air about her identity
అలా గ‌తంలో ఇమ‌న్వీ పాకిస్తానీ అని కొన్ని వార్తలు తెగ వైరల్ గా మారాయి. కాగా.. తాజాగా పహ‌ల్గంలో జరిగిన ఉగ్రదాడి కారణంగా పాకిస్తానీలను భారతీయులు వ్యతిరేకిస్తూ తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తానీలు.. భారత్ నుంచి వెళ్లిపోవాలంటూ డిమాండ్లు కూడా మొదలయ్యాయి. గవర్నమెంట్ కూడా ఇదే ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే చాలామంది పాకిస్తానీలు ఇండియా వదిలి పాకిస్తాన్ కు వెళ్ళిపోయారు. ఇందులో భాగంగానే ఫౌజి మూవీలో నటించే హీరోయిన్ కూడా పాకిస్తానీనే కనుక.. ఆ హీరోయిన్ సినిమాలో నుంచి తీసేయాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి. ఒకవేళ తనే సినిమాలో నటిస్తే సినిమానే బ్యాన్ చేస్తామంటూ వ్యతిరేకత ప్రారంభమైంది. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి.

fauji imanvi : పాకిస్తానీ కాదు అని అబద్ధం చెప్పిన ప్రభాస్ బ్యూటీ, పాత  పోస్ట్ వైరల్ - BigTvLive

ఈ క్రమంలోనే దీనిపై ఇమ‌న్వీ స్పందిస్తూ. నేను పాకిస్తానీ కాదు, నా రక్తంలోనే భారతీయత ఉంది, నేను లాస్ ఏంజల్స్ లో పుట్టా.. మా ఫ్యామిలీ అమెరికాకి చెందిన పౌరులే అంటూ వివరించింది. ఇక దీంతో.. గొడవ సర్దుమనిగిందని అంతా అనుకున్నారు. కానీ.. గతంలో ఇమ‌న్వీ పెట్టిన పోస్ట్‌లు నేటిజన్ల‌ కంటపడ్డాయి. అందులో ఇండిపెండెన్స్ డే సందర్భంగా.. ఇమన్వీ ఇస్మాయిల్.. నా తండ్రి పాకిస్తాన్, నా తల్లి ఇండియా అని వచ్చేలా పోస్ట్ ని షేర్ చేసుకుంది. ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో తాను పూర్తిగా అబద్దాలు చెప్పిందని.. ఆమె తండ్రి పాకిస్తాన్ కి చెందిన వ్యక్తి కనుక ఆమె కూడా పాకిస్తానీనే అవుతుందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అలా ఇమన్వి తాను పాకిస్తానీ కాదని కామెంట్లు చేసిన తను.. పెట్టిన ఇన్‌స్టా పోస్టుల ద్వారా ఆధారాలతో సహా దొరికిపోయింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నాయి.