టాలీవుడ్‌లో ఎంతమంది స్టార్ హీరోస్ ఉన్నా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ వేరే లెవెల్ అనడంలో అతిశయోక్తి లేదు. సినిమాల పరంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్.. తన క్యారెక్టర్ తోను కోట్లాది మందిని ఆకట్టుకున్నాడు. ఇక ముఖ్యంగా ఆయన అమ్మాయిలను ఎంతగానో గౌరవిస్తారు. తనతో పని చేసే హీరోయిన్లకు చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని ఇప్పటికే పవన్ తో కలిసి పనిచేసిన కోస్టార్, నటించిన ఎంతోమంది హీరోయిన్లు షేర్ చేసుకుంటూ ఆయనను ప్రశంసించారు.
అంతేకాదు.. గొప్ప మనస్తత్వం కలవాడని చెబుతూ ఉంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ గతంలో ఓ హీరోయిన్ పై చేయి చేసుకున్నారంటూ న్యూస్ వైరల్ గా మారింది. ఇక ఆ హీరోయిన్ మరెవరో కాదు భూమిక చావ్లా. పవన్ కళ్యాణ్, భూమిక జంటగా నటించి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఖుషి సినిమా ఎవర్ గ్రీన్‌గా నిలిచిపోయింది. ఈ సినిమా అప్పట్లో యూత్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా బ్లాక్ బస్టర్ మూవీ ఖుషి షూటింగ్ సమయంలో.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ భూమికపై ఫుల్ సీరియజ్ అయ్యి.. ఆమెపై చేయి కూడా చేసుకున్నారట.
అప్పట్లో ఈ న్యూస్ తెగ వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే పవన్‌తో నెక్స్ట్ సినిమా అంటే నేను చేయనని ఇలియానా సినిమాను కూడా రిజెక్ట్ చేసిందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ భూమికపై చేయి చేసుకోవడం కారణంగానే ఇలియానా పవన్‌తో సినిమా అంటే భయపడిపోయి నో చెప్పిందని రూమర్లు పెద్ద ఎత్తున వైరల్‌గా మారాయి. కానీ.. ఈ విషయం తెలిసిన చాలామంది పవన్ సన్నిహితులు మాత్రం వీటిల్లో ఏ మాత్రం వాస్తవం లేదని.. పుకార్లను క్రియేట్ చేసి ఆయనంటే పడని వారు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు.. అంటూ క్లారిటీ ఇచ్చారు.