అల్లు స్నేహారెడ్డితో విజయ్ దేవరకొండ.. ఈ ట్విస్ట్‌తో ఫ్యాన్స్‌కు ఫ్యూజ్‌లు అవుట్..

టాలీవుడ్ రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు, అల్లు కుటుంబానికి మధ్య మొదటి నుంచి మంచి ఫ్రెండ్షిప్ ఉందన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. అల్లు అరవింద్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన గీతగోవిందం సినిమాలో నటించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఓ మీడియం రేంజ్‌ హీరో మూవీ ఈ రేంజ్‌ కలెక్షన్లు కల్లగొట్టడం సాధార‌ణ విష‌యం కాదు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు కూడా.. ఏ మీడియం రేంజ్‌ హీరో.. ఈ రికార్డును టచ్ చేయలేకపోయాడు అంటే అది ఏ రేంజ్ బ్లాక్ బస్టరో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా తర్వాతే విజయ్ దేవరకొండకు యూత్, అలాగే లేడీ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక‌ అల్లు అరవింద్‌, అల్లు అర్జున్తో మొదటి నుంచి రౌడీ స్టార్ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాడు. వారితో కలిసి ఎన్నో మూమెంట్స్ ను షేర్ చేసుకుంటూ ఉంటాడు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్.. విజయ్ దేవరకొండ మధ్య స్నేహం అందరికీ తెలుసు. కానీ.. అల్లు స్నేహారెడ్డి తో కూడా ఆయనకు మంచి బాండ్ ఉంటుందని తాజాగా జరిగిన ఓ సంఘటనతో క్లారిటీ వచ్చేసింది. రీసెంట్గా ఆయన ప్రయాగరాజ్‌ మహా కుంభమేళాకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లి సందడి చేశాడు. ఆయన కుంభమేళాలో స్నానం ఆచరిస్తూ.. అలాగే ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. తన ఎక్స్‌ వేదికగా.. కుంభమేళాలు తీసుకున్న ఫోటోలు అప్లోడ్ చేయగా.. క్షణాల‌లో అవి వైరల్‌గా మారాయి. అయితే.. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. విజయ్ దేవరకొండతో పాటు.. ఈ మహాకుంభమేళాలో అల్లు అర్జున్ భార్య.. అల్లు స్నేహారెడ్డి, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా కనిపించారు.

కానీ అల్లు అర్జున్ మాత్రం ఈ ఫోటోలో లేరు. ఈ క్రమంలోనే కేవలం బన్నీతోనే కాదు.. స్నేహ రెడ్డితోను రౌడీ స్టార్ కు ఇంత మంచి స్నేహం ఉందా అంటూ ఫ్యాన్స్ నోరుళ‌బెడుతున్నారు. ఇదిలా ఉంటే స్నేహ రెడ్డి మాత్రం తన కుంభమేళాకు వెళ్లినట్లు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోలేదు. ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గౌతంతిన్న‌నూరి డైరెక్షన్లో కింగ్డమ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సినిమా నుంచి టీజర్ కూడా రిలీజై ఆడియన్స్ లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక‌ మే 30న రిలీజ్ కానున్న ఈ సినిమా తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)