టాలీవుడ్ సక్సస్‌ఫుల్ డైరెక్టర్ రాజమౌళి తర్వాత వినిపించే పేరు అనిల్ రావిపూడి. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటినుంచి ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు అనిల్. ఇక కమర్షియల్ సినిమాలను తనదైన స్టైల్ లో తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఐదు నుంచి ఆరు నెలల్లో తెరకెక్కించి మంచి అవుట్‌పుట్ ఇవ్వడం అనిల్ స్పెషాలిటీ. ఈ క్రమంలోని తాజాగా సంక్రాంతి వస్తున్నాం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా ఈ సినిమా సంచలనం సృష్టించింది.
ఇక అనిల్ రావిపూడి నెక్స్ట్ చిరంజీవితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగానే చిరు ఎంటైర్ కెరీర్‌లో ఇప్పటివరకు లేని రేంజ్ లో సక్సెస్ అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక చిరంజీవి నటించిన ఏ సినిమాలో అయినా ఆయనకు గట్టి పోటీ ఇస్తూ స్ట్రాంగ్ గా ఢీకొట్టే విలన్ పాత్ర విషయంలో డైరెక్టర్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి కూడా చిరుతో తలపడబోయే విలన్ పాత్ర విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా చిరుకు విలన్‌గా మరో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నటించిన ఉన్నాడని సమాచారం.
దీంతో చిరుకి విలన్ గా మోహన్ బాబు అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా మూవీ టీం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాల్లో రాజశేఖర్ విలన్ గా నటించబోతున్నాడట. ఈ క్రమంలోనే చిరు, అనిల్ స్టోరీ డిస్కషన్ లో కూడా రాజశేఖర్ పేరు వినిపించినట్లు సమాచారం. ఇక ఇప్పటివరకు తన సినీ కెరీర్‌లో తెరకెక్కించిన ఎనిమిది సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న అనిల్.. చిరు సినిమాతో కూడా మరోసారి సక్సెస్ అందుకుంటే టాలీవుడ్ లోనే త్రిబుల్ హ్యాట్రిక్ అందుకున్న స్టార్ డైరెక్టర్ గా ఘనత సాధిస్తాడు.