ఉదయ్ కిరణ్ మిస్ చేసుకున్న ప్రభాస్ బ్లాక్ బస్టర్.. ఏదో తెలుసా..?

దివంగత హీరో ఉద‌య్ కిర‌ణ్.. టాలీవుడ్‌లో లవర్ బాయ్‌గా త‌న‌కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుని రాణించిన సంగతి తెలిసిందే. తన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి ఆకట్టుకున ఈ యంగ్ హీరో.. అప్పట్లో ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తర్వాత ఆ రేంజ్ క్రేజ్‌ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సోంతం చేసుకున్నాడు. ఎంతోమంది అమ్మాయిలు ఉదయ్ కిరణ్ అంటే పడి చచ్చిపోయేవారు. అలాంటి క్రేజ్‌ దక్కించుకున్న ఈ టాలెంటెడ్ హీరో.. మెల్లమెల్లగా డౌన్ ఫాల్ అవుతూ వచ్చారు. సినిమాలు సరిగ్గా ఆడక పోవడం.. సరైన అవకాశాలు రాకపోవడంతో.. డిప్రెషన్‌కి వెళ్లిపోయాడు.

ఉదయ్‌ కిరణ్‌ మిస్‌ చేసుకున్న ప్రభాస్‌ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా? చేసి  ఉంటే ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌ - uday kiran missed prabhas blockbuster movie  if he was done ...

అయితే.. స్వయంగా త‌ను చేసిన కొన్ని మిస్టేక్స్ కూడా ఆయన డౌన్ ఫాల్కు కారణమని సమాచారం. ఉదయ్ కిరణ్ తన కెరీర్.. మంచి పిక్స్‌లో ఉన్న సమయంలో ఎంచుకునే కథలు విషయంలో కాస్త తడబడ్డారని.. ఈ క్రమంలోనే ఓ బ్లాక్ బస్టర్ సినిమాను ఉదయ్ కిరణ్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. అదే సినిమాను ప్రభాస్ నటించి హిట్ అందుకున్నాడు. ఆ మూవీ మరేదో కాదు వర్షం. ప్రభాస్, త్రిష జంటగా నటించిన ఈ సినిమా.. అప్పట్లో సంచలనం సృష్టించింది. ఓవైపు చిరంజీవి అంజి, మరోవైపు బాలకృష్ణ.. లక్ష్మీనరసింహ సినిమాల నడుమ‌ ఎలాంటి అంచనాలు లేకుండా.. చిన్న సినిమాగా రిలీజై.. ఆ రెండు సినిమాలను వెనక్కునెట్టి.. బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచింది.

Varsham (2004) - IMDb

ఇక గోపీచంద్ విల‌న్‌గా.. శోభన్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు ఎమ్.ఎస్. రాజు నిర్మాతగా వ్యవహరించారు. కాగా ఈ కథ మొదట ఉదయ్ కిరణ్ చేయాలట. ఆయన‌నే హీరోగా భావించారట. ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ కూడా ఓకే అయిన తర్వాత.. కారణం తెలియదు కానీ ఉదయ్ కిరణ్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పకున్నాడు. ఈ విషయాన్ని ఒకప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జోషియాపట్ల వెల్లడించారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ కెరీర్‌లో ఎన్నో మంచి ప్రాజెక్ట్ వచ్చాయి.. పోయాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఆ బ్లాక్ బస్టర్లు అన్నింటిలో నటించి ఉంటే.. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ గ్లోబల్ స్టార్ రేంజ్‌లో ఉద‌య్ కిర‌ణ్ ఓ వెలుగు వెలిగేవాడిని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.