14 ఏళ్లకు ఇండస్ట్రీలో ఎంట్రీ.. తనకన్నా 15 ఏళ్ల పెద్దోడితో ఎఫైర్.. ఈ అమ్మ ఎవరంటే..?

ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ సెలబ్రిటీలుగా ఎదగాలంటే అందం, అభినయం, టాలెంట్‌తో పాటు.. త‌ప్ప‌కుండా అదృష్టం కూడా కలిసిరావాలి. ఎంత టాలెంట్ ఉన్నా.. అదృష్టం లేకపోతే ఇండస్ట్రీలో రాణించడం కష్టం. ఇప్పటికే అది ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఎంతోమంది ముద్దుగుమ్మలు చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చి.. అదృష్టంతో భారీ సక్సెస్‌లు అందుకున్నారు. అతి తక్కువ వయసులోనే హీరోయిన్లుగా విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకున్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఈ చిన్నది కూడా.. అదే కోవకు చెందుతుంది. ఆమె ప్రస్తుతం ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్.

Iqra Aziz nominated Best TV Actress for Lux Style Awards - Daily Times

అంతేకాదు.. తనకన్నా 15 ఏళ్ల పెద్దవాడిని వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. కేవలం తన సినీ కెరీర్‌లో న‌ట‌న‌తోనే రూ.700 కోట్లకు పైగా కూడబెట్టిందట‌. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో చెప్పలేదు కదా.. తనే ఇక్రా అజీజ్. ఈమె టాలీవుడ్ బ్యూటీ కాక‌పోవ‌డంతో ఇక్క‌డి ఆడియ‌న్స్‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేక‌పోవ‌చ్చు. ఈమె పాకిస్తాన్ నటి. మొదట టీవీ షో లతో కెరీర్ ప్రారంభించిన ఈ అమ్ముడు తర్వాత న‌టిగా తనను తాను ప్రూవ్ చేసుకుంది. అదే సమయంలో రిచెస్ట్ న‌టిగా ఇమేజ్ దక్కించుకుంది.

Iqra Aziz: Latest News, Photos and Videos - BollywoodShaadis.com - Page 1

చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఇక్రా ను తల్లి ఎంతో కష్టపడి పెంచింది. చిన్నతనం నుంచి తల్లి పడ్డ కష్టాలు, త్యాగాలను చూస్తూ పెరిగిన ఇక్రా.. ఆర్థిక సమస్యల కారణంగా ఉన్నత చదువులు చదువుకోలేకపోయింది. 14 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఈ అమ్మ‌డు.. కిసే అప్నా కహే టీవీ షోలో అవకాశాన్ని దక్కించుకుంది. తన టాలెంట్‌తో అందరినీ మెప్పించి వరుస అవకాశాలను దక్కించుకుంది. ప్రముఖ పాకిస్తాన్ నటుడు, రైటర్ యాసిర్ హుస్సేన్‌ను ప్రేమించి అతని వివాహం చేసుకుంది. అతను ఇక్రా కన్న 15 ఏళ్ళు పెద్దవాడు కావడం విశేషం. 2019లో వీరికి వివాహం జరిగింది. ఇక ఇక్రా పాక్‌లోనే అత్యంత సంపన్న హీరోయిన్.