చిరు సినిమా కోసం అనిల్ హైయెస్ట్ రెమ్యూనరేషన్.. ఎంత తీసుకుంటున్నాడంటే.. ?

టాలీవుడ్‌లో కమర్షియల్ సినిమాలతో సక్సెస్ తప్ప.. ఫెయిల్యూర్‌ తెలియని దర్శకుడుగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ రాజమౌళి తర్వాత ఎవరైనా ఉన్నారంటే అది అనిల్ రావిపూడి అని టక్కున చెప్పేస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ పటాస్ సినిమాతో టాలీవుడ్‌కు దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అనిల్. ఇక మొదటి సినిమాతోనే కమర్షియల్ గా సెన్సేషనల్ హిట్ అందుకున్న ఈ కుర్ర డైరెక్టర్.. తాజాగా వ‌చ్చిన‌ సంక్రాంతికి వస్తున్నాం మూవీ వ‌ర‌కు వరుస సూపర్ హిట్ల‌ను తన కాస్త ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఎంత పెద్ద స్టార్ హీరోలు సినిమాలైనా ఐదు నుంచి ఆరు నెలల్లో పూర్తి చేసి బెస్ట్ అవుట్‌ఫుట్ ఇవ్వగల సత్తా ఉన్న ఏకైక డైరెక్టర్‌గా అనిల్ రావిపూడి పేరు మ‌రుమ్రోగిపోతుంది.

Director Anil Ravipudi Celebrates a Decade of Success in Telugu Cinema

ఈ క్రమంలోనే తాజాగా ఆయన సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాను నెలల వ్యవధిలోనే తెర‌కెక్కించి బ్లాక్ బ‌స్టర్ అందుకున్నాడు. వెంకీ సినిమాకు వందకోట్లు రావడమే కష్టం అనుకునే సమయంలో.. ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు. ఓ విధంగా చెప్పాలంటే ప్రాంతీయ భాష సినిమాల్లో టాలీవుడ్ లోనే ఇండస్ట్రియల్ హిట్ సినిమాగా ఇది నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు. ఇక అనిల్ రావిపూడి సినిమా తర్వాత సాహూగారపాటి నిర్మాణంలో.. మెగాస్టార్ చిరంజీవిని హీరోగా పెట్టి మరో సినిమాను చేయనున్నాడు. కాగా అనిల్ రావిపూడి ఈ మూవీ కోసం త‌న రెమ్యున‌రేష‌న్ అమాంతం పెంచేసినట్లు సమాచారం. ఏకంగా చిరు.. ఈ ప్రాజెక్టు కోసం రూ.25 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడట.

Megastar Chiranjeevi Biography: Movies, Photos, Videos, News, Biography &  Birthday

లాభాల్లోనూ కొంత శాతం వాటా ఉండనుందని సమాచారం. ఇక‌ అనిల్ రమ్యునరేషన్ ఈ రేంజ్ లో ఉందంటే.. మెగాస్టార్ రెమ్యూనరేషన్ ఇంకెన్ని కోట్లో గెస్ చేయ‌డం క‌ష్టం. ఇక‌ ఈ సినిమాతో రూ.500 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టాలని ప్లాన్ చేస్తున్నాడట అనీల్‌. వచ్చేయడానికి సంక్రాంతి కానుక సినిమా రిలీజ్ కాన ఉందని టాక్. ఒకవేళ కచ్చితంగా పండగ సీజన్ లో ఈ మూవీ వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం ఆ రేంజ్ వసూళ్ళు రావడం మరింత సులువు అవుతుంది. ఇక చిరంజీవి నుంచి పూర్తిస్థాయి కామెడీ సినిమా చూసి చాలా రోజులైంది. ఈ క్రమంలోనే వింటేజ్ మెగాస్టార్ ను చూసేందుకు.. ఆయన కామెడీ టైమింగ్ ఎంజాయ్ చేసేందుకు ఆడియన్స్ ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. అందుకు తగ్గట్టుగానే అనిల్ రావిపూడి వెంకటేష్ చంట‌బ్బాయి కాలంనాటి చిరంజీవిని మరోసారి మన ముందుకు తీసుకురానున్నాడట‌.