టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబోలో సినిమా అంటే ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ అంచనాలు ఉంటాయి. గతంలో రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ కాంబో.. మరోసారి కలిసి పనిచేయనున్నారు. పుష్పా లాంటి సాలిడ్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ తర్వాత సుకుమార్ రామ్ చరణ్‌తో మరో సినిమాను తెరకెక్కించనున్నాడు. ఆర్ సి 17 రన్నింగ్ టైటిల్‌తో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఇప్పటికే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమాల్లో చరణ్ డిఫరెంట్ పవర్ఫుల్ రోల్‌లో కనిపించనున్నాడని సమాచారం. ఇప్పటికే బన్నీతో ఫుల్ మాస్ లెవెల్ సినిమా తెరకెక్కించిన సుక్కు.. చరణ్ కోసం స్టైలిష్ యాక్షన్ డ్రామా ప్లాన్ చేశాడట.
ఇక ఇందులో రామ్ చరణ్ ఒక్కడు కాదు.. మరో పాత్ర కోసం ఆడియన్స్ కు బిగ్ సర్ప్రైజ్ సుక్కు ప్లాన్ చేయనున్నాడని తెలుస్తుంది. అంటే చరణ్.. ఈ సినిమాలో డ్యూయల్ రోల్‌లోను యాక్షన్‌తో అదరగొట్టనున్నడట. నాయక్ సినిమాలో రెండు పాత్రలో కనిపించిన చరణ్.. మళ్ళీ ఇన్నాళ్లకు సుక్కు డైరెక్షన్‌లో ఈ డబుల్ బ్లాస్ట్ కు సిద్ధమయ్యాడు. ఇక సుక్కు ఇప్పటివరకు వచ్చిన ప్రతి సినిమాతోను ఓ విభిన్నమైన థీంతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఆర్‌సి17 కూడా ఓ స్పెషల్ దీంతో ఆడియన్స్ ముందుకు రానుందని టాక్.
అంతేకాదు.. ఈ సినిమాపై చరణ్ కూడా భారీగా అంచనాలు పెట్టుకున్నాడట. మరో క్లాసిక్ సినిమా సుక్కు తనకివ్వనున్నాడని ఫిక్స్ అయ్యాడట. ఈ నేపథ్యంలోనే సుకుమార్ తో చరణ్ డిస్కషన్లు జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ వరకు పూర్తయిందని టాక్ నడుస్తుంది. ప్రస్తుతం చరణ ఆర్సి16తో బిజీ బిజీగా గడుపుతున్నాడు. త్వరలోనే సినిమాను పూర్తి చేసి ఆర్ సి 17 సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు. ఇక సుకుమార్ మార్క్ మాస్ యాక్షన్ తో.. చరణ్ డ్యూయల్ రోల్ లో నటించడం అంటే ఈ ప్రాజెక్ట్ పక్క్ఇ హిట్ అంటూ కమెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే త్వరలో సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ రావచ్చని టాక్.