ప్రస్తుతం థియేటర్లలో దుమ్మురేపుతున్న ఆ బ్లాక్ బస్టర్ ను మహేష్ రిజెక్ట్ చేశాడా.. ?

టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ష‌న్‌లో పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎస్‌ఎస్‌ఎంబి 29 రన్నింగ్ టైటిల్ తో ఈ సినిమాను కూడా అనౌన్స్ చేసిన టీం.. ప్రస్తుతం షూటింగ్‌లో బిజీగా గడుపుతున్నారు. కాగా.. మహేష్ బాబు చివరిగా గుంటూరు కారం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే రాజమౌళి ప్రాజెక్టుతో మరోసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడుతున్నాడు మహేష్. ఈ క్రమంలోనే గుంటూరు కారం సినిమా తర్వాత ఆయన ఒక్క సినిమాను కూడా ఒప్పుకోలేదు.

The audience is expecting the movie Chavaa to be released in Telugu. - NTV  Telugu

కానీ.. మహేష్ ఒప్పుకుని ఉంటే ఇప్పుడు ఆయన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ మూవీ ఉండేదని ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేది అంటూ టాక్ నడుస్తుంది. మహేష్ ను ఎప్పుడు డిఫరెంట్ రోల్‌లో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. అలాంటిది వీరుల పాత్రలో మహేష్ బాబును చూడడానికి ఎంతగానో ఆసక్తి చూపుతారు. కానీ.. మహేష్ మాత్రం అలాంటి ఓ సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేశాడట. అదే ప్రాజెక్టును బాలీవుడ్ స్టార్ హీరో నటించి.. బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికీ ఈ సినిమా ధియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతూనే ఉంది. ప్రొడ్యూసర్లకు కాసుల వర్షం కురిపిస్తుంది.

ఇంతకీ మూవీ ఏంటో చెప్పలేదు కదా.. హిందీలో ఫిబ్రవరి 14న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అయిన చావా. ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే మంచి టాక్ రావడంతో.. ఇప్పటికీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సాంబాజి మహారాజ్ జీవిత క‌థ‌ ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా.. కేవలం బాలీవుడ్‌లోనే రిలీజ్ అయింది. నేషనల్ క్రష్‌ రష్మిక మందన చత్రపతి సాంబాజి మహారాజ్ భార్య ఏసుభాయి పాత్రలో మెరిసింది. వారం రోజులు కూడా కాకుండానే ఏకంగా రూ.234 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఈ సినిమాలో నటించి ఉంటే ఫ్యాన్స్‌కు కచ్చితంగా ఫుల్ మీల్స్‌లా ఉండేదని.. కానీ ఎస్ఎస్ఎంబి 29 సైన్ చేసిన మహేష్.. ఈ ప్రాజెక్ట్ చేయలేకపోయారంటూ సమాచారం.