సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒకసారి స్టార్ హీరోగా మారిన తర్వాత.. ఆ స్టార్ హీరో స్టేటస్ కాపాడుకోవడం మరింత కష్టం. అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ కూడా తన స్టార్‌డంను మరింతగా పెంచుకునేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతితక్కువ సమయంలోనే తన సొంత టాలెంట్‌తో.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్న చరణ్.. ఆ సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్నారు.
ఇక ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ సక్సెస్ సాధించి మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో తన సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చివరిగా చరణ్ నటించిన గేమ్ ఛస్త్రంజర్ డిజాస్టర్ కావడం ఫ్యాన్స్‌కు నిరాశ కల్పించింది. ఈ క్రమంలో ఆర్సి16 తో చరణ్ హిట్ కొడితే తప్ప ఆయన కెరీర్‌కు ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలోనే.. తాను నటించే ప్రతి సినిమాతో సక్సెస్ సాధించి.. మరింత ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక చిరు సైతం రామ్ చరణ్ సినిమాలన్నీ తనకు నచ్చుతాయని చెబుతూనే.. ఆర్మీ ఆఫీసర్ పాత్రలో చరణ్ నటిస్తే చూడాలని ఉంది అంటూ తన కోరికను వెళ్లబుచ్చాడు.
రామ్ చరణ్ ఆర్మీ పాత్రకు బాగా సెట్ అవుతాడని ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. నిజంగా చరణ్ బాడీ లాంగ్వేజ్, క్యారెక్టర్.. ఆర్మీ ఆఫీసర్కు అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని.. ఆర్మీ ఆఫీసర్గా ఆయన సరిగ్గా సరిపోతాడని చిరంజీవి భావిస్తున్నాడట. త్రిబుల్ ఆర్ సినిమాతో పోలీస్ ఆఫీసర్గా చరణ్ కనిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫుల్ లెన్త్ రోల్లో ఓ ఆర్మీ ఆఫీసర్గా భారీ ప్తాజెక్ట్‌లో చరణ్ నటిస్తే బాగుంటుందని ఆడియన్స్‌లోను అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే చరణ్ తన తండ్రి, అలాగే ఫ్యాన్స్ కోరుకుంటున్నా విధంగా భారీ ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో సినిమాను చేసి చూపిస్తాడా.. లేదా వేచి చూడాలి.