అఖండ 2 కోసం బాలయ్య మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లు అంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ.. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా చిరు, నాగార్జున, వెంకటేష్‌ల‌ను మించిపోయి హయ్యస్ట్ సక్సెస్‌లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు చిరంజీవి టాలీవుడ్ నెంబర్‌వ‌న్ సీనియర్ స్టార్ హీరోగా నిలబడ‌గా.. ఇప్పుడు బాలయ్య ఆ ప్లేస్‌ని కొల్లగొట్టాడు. వరుసగా.. నాలుగు సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకొని మంచి ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి, డాకు మహారాజ్‌ల‌తో వరుసగా నాలుగు సినిమాలు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డులు సృష్టించాడు. త్వరలోనే మరో రెండు బ్లాక్ బాస్టర్ సక్సెస్ తన ఖాతాలో వేసేందుకు సిద్ధమవుతున్నాడు బాలయ్య. ఈ క్రమంలోనే బాలయ్య డబ్బులు హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

BB3 titled as 'Akhanda': Balakrishna roars as Aghori in Ugadi teaser |  Telugu Movie News - Times of India

ఇక‌బాలయ్య కూడా దానికి తగ్గట్లుగానే కథలను, దర్శకులను సెలెక్ట్ చేసుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రెండో కూతురు తేజస్వి ఎంట్రీతో ఆయన జాతకమే మారిపోయింది. వాస్తవానికి.. కరోనా ముందు వరకు బాలయ్య వరుస ప్లాప్స్ చూశాడు. బాలయ్య పని అయిపోయిందని కూడా ఎంతోమంది నెగటివ్ కామెంట్స్ చేశారు. అలాంటి క్రమంలో తేజస్విని బాలయ్య సినిమాల్లో జోక్యం చేసుకొని కథలను సెలెక్ట్ చేయడం, ఏ దర్శకులను సెలెక్ట్ చేసుకోవాలని నిర్ణయాలను ఆమె సజెస్ట్ చేయడంతో బాలయ్య స్గైల్‌ పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలోనే మరోసారి బాలయ్య బోయపాటి శీను డైరెక్షన్లో అఖండ లాంటి బ్లాక్బస్టర్ సీక్వల్‌గా అఖండ 2లో నటిస్తున్నాడు. దీన్ని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయనున్నారు.

Akhanda 2 - Thaandavam': Release date of Nandamuri Balakrishna's film with  Boyapati Sreenu announced - The Hindu

ఇది బాలయ్య కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్‌ ఇండియా సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమా సెట్స్‌లో బాలయ్య ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. అఖండ హిందీ వర్షన్ యూట్యూబ్‌లో వచ్చిన రెస్పాన్స్ తో.. అఖండ 2లో బాలయ్య అఘోర పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దాడు బోయపాటి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బాలయ్య వరుస‌ బ్లాక్ బస్టర్‌లతో మార్కెట్ కూడా అదే రేంజ్ లో పెంచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య అఖండ కోసం ఏకంగా రూ.35 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట‌. ఇక బాలయ్య రమేనరేషన్ల విషయంలో నిర్మాతలకు ఎప్పుడు ఇబ్బంది కల్పించడ‌న్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య అడగకుండానే రెమ్యూనరేషన్ను పెంచుకుంటూ ఇస్తున్నారు ప్రొడ్యూస‌ర్స్‌. ఇప్పుడు ఆఖండ 2కు కూడా నిర్మాతలే ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఇక ఈ రెమ్యున‌రేష‌న్ నుంచి డబ్బు ఖర్చు చేసి మ్యూజిక్ డైరెక్టర్ థ‌మ‌న్‌కు ఖరీదైన కార్ గిఫ్ట్ గా ఇచ్చాడు బాల‌య్య‌.