ఈ ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ బుజ్జాయి.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టారా..?

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ బుజ్జయిని గుర్తుపట్టారా.. ఈమె ప్రస్తుతం ఓ స్టార్ హీరోయిన్. భాషలతో సంబంధం లేకుండా.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. టాలీవుడ్ లో తను నటించిన సినిమాలతో లక్షలమంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. కుర్ర‌కారును ఫిదా చేసింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. తను మరెవరో కాదు వెండితెరపై తన ఉంగరాల జుట్టు, చేప కళ్ళ సొగ‌సుల‌తో అందరినీ ఆకట్టుకున్న అనుపమ పరమేశ్వరన్. 2015లో మలయాళ.. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత తెలుగులో అఆ.. సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది.

Anupama Parameswaran Movies, News, Photos, Age, Biography

ఈ సినిమా తర్వాత సర్వానంద హీరోగా నటించిన శతమానం భవతి సినిమాతో హీరోయిన్గా మరీంది. తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. దీంతో టాలీవుడ్‌లో వరుస‌ సినిమా అవకాశాలు దక్కించుకొని క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక మొద‌ట‌ గ్లామరస్ బ్యూటీగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకునే ఈ అమ్మ‌డు టిల్లు స్క్వేర్‌తో బోల్డ్ బ్యూటీగా తన అందాలను వలకబోసింది. అంతే కాదు ఈ సినిమాలో అమ్మడి పర్ఫామెన్స్‌కు కుర్ర కారు ఫిదా అయ్యారు. అయితే ఈ సినిమా తర్వాత ఎందుకో స్లో అయిన అనుప‌మ‌.. తెలుగు స్క్రీన్ పై కనిపించకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Secret behind Anupama Parameswaran's bold skin show - News - IndiaGlitz.com

ప్రస్తుతం అమ్మడి చేతిలో పలు సినిమా అవ‌కాశ‌లు ఉన్నప్పటికీ.. ఆ సినిమా ప్రమోషన్స్‌లో కానీ.. సోషల్ మీడియాలో కానీ.. కనిపించకపోవడం ఫ్యాన్స్‌ను మరింత డిస్సపాయింట్ చేస్తుంది. ఇక.. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెర‌కెక్క‌నున్న‌ డ్రాగన్ సినిమాలో అనుపమ హీరోయిన్గా నటించింది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోను ఈ సినిమాపై మంచి బజ్‌ నెలకొంది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి అప్డేట్ ను ఆడియన్స్ తో పంచుకునే అనుప‌మ‌ ఈ క్రమంలోనే తన చిన్ననాటి ఫోటో కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ప్ర‌స్తుత్ అది తెగ వైరల్ అవుతుంది.