హీరోయిన్ సనమ్ శెట్టి.. ఈ పేరు చెప్పగానే గుర్తుకు రాకపోవచ్చు కానీ.. ఈ అమ్మడు టాలీవుడ్ సినిమాలోను హీరోయిపన్‌గా మెరిసింది. మొదట మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. నటిన పై ఆసక్తితో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడిన ఈ అమ్మడు.. తమిళ్ సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్ లో అవకాశాలు దక్కించుకొని నటించింది. ఈ క్రమంలోనే మంచి పాపులారిటీ దక్కడంతో బిగ్ బాస్ అవకాశాన్ని దక్కించుకుంది. ఇక హౌస్‌లో తన ఆటతీరుతో ప్రేక్షకులను మెప్పించి మరింత క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అలా 2016లో టాలీవుడ్ యాక్టర్ మానస్ హీరోగా నటించిన ప్రేమికుడు సినిమాలో హీరోయిన్గా పరిచయమైంది. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు.
ఈ క్రమంలో తెలుగు ఇండస్ట్రీ నుంచి మళయళ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది. కాగా.. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సనాంశెట్టి.. ఇటీవల కూల్ సురేష్ హీరోగా నటించిన ఓ సినిమా ప్రారంభోత్సవానికి హాజరై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల బ్యాడ్ గర్ల్ అనే సినిమా టీజర్ రిలీజ్ కాగా.. టీజర్ పై చాలా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఈ టీజర్ బోల్డ్‌గా ఉందని చెప్పుకొచ్చింది. ఇక సినిమాకు ఇది ఎగ్జాంపుల్ కాదని.. ఇదో చెత్త ఉదాహరణ అంటూ వివరించింది. ఎందుకంటే స్వేచ్ఛ , లింగ సమానత్వం అనే అంశాలను కూడా తప్పుగా సినిమాలో చూపించారు.. అబ్బాయిలతో పోటీపడి మరి మందు తాగడం, సిగరెట్ తాగడం సమానత్వం కాదు.. సమానత్వం అంటే అన్నిటిలోను సమానంగా ఆడవారిని కూడా గౌరవించాలని వివరించింది.
ముఖ్యంగా హీరోని సంప్రదించే విధానం, హీరోయిన్లను సెలెక్ట్ చేసుకునే విధానం కూడా ఒకేలా ఉండాలని చెప్పుకొచ్చింది. ఉదాహరణకు నన్నే తీసుకోండి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. సినిమాల్లో నటించమని పిలవడానికి బదులుగా.. నన్ను చాలామంది వారితో కలిసి రాత్రి గదిలో గడపమని పిలుస్తున్నారని.. ఇది సమానత్వమా అంటూ మండిపడింది. అసలు ఈ బ్యాడ్ గర్ల్ సినిమా టీజర్ అమ్మాయిలను చెడగొట్టేలా ఉందని.. బాధ్యతగా వ్యవహరించాల్సిన నిర్మాతలు.. బాధ్యతాయుతమైన సినిమాలు తీయవలసిన వారు.. వాటికి బదులుగా ఇలాంటి సినిమాల కోసం నిధులు సమకూర్చడం తీవ్ర నిరాశ కల్పిస్తుంది అంటూ వెల్లడించింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.