టాలీవుడ్‌లో క్లాస్, మాస్ అని తేడా లేకుండా.. అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో అనుష్క శెట్టి కూడా ఒకటి. యూత్‌ను తన అంత చెందాలతో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. ఫ్యామిలీ ఆడియన్స్‌ను తను నటనతో ఫిదా చేసింది. మాస్ ఆడియన్స్‌ను అయితే ఈ అమ్మడి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఆకట్టుకుంది. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ సరైన క్రేజ్ ను తగ్గించుకుంది ఈ క్రమంలోనే లేడీ సూపర్ స్టార్ గా తిరుగులేని ఇమేజ్ ని దక్కించుకున్న అనుష్క.. మొదట నాగార్జున సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆమె సెకండ్ హీరోయిన్ గా మెరిసింది.
ఈ సినిమాలో తన నటన దర్శక, నిర్మాతలను విశేషంగా ఆకట్టుకుంది. అప్పటినుంచి తిరిగి వెనక చూసుకోవాల్సిన అవసరం లేకుండా.. వరుస సినిమాలతో దూసుకుపోయింది. బాహుబలి లాంటి పాన్ ఇండియన్ ప్రాజెక్టులో భాగమైంది. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తూ.. తన ఇమేజ్ను కాపాడుకున్న అనుష్క.. సినిమాల్లోకి రాకముందు టీవీ సీరియల్‌లోను నటించిన సంగతి చాలా మందికి తెలిసి ఉండదు. అప్పట్లో స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే యువ టీవీ సీరియల్ చాలా మంచి సక్సెస్ అందుకుంది. ఇందులో అనుష్క ఓ ఎపిసోడ్‌లో తళ్ళుక్కున్న మెరుస్తుంది. 2007లో ప్రసారమైన ఈ టీవీ సీరియల్ లో అనుష్క వాసు అనే వ్యక్తి లవర్ గా మెరిసింది.
మూడు జంటలు చుట్టూ తిరిగే సీరియల్ లవ్ స్టోరీ ఎంతో ఫన్నీగా ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఇక ఇందులో అనుష్క నాగలక్ష్మి అనే పాత్రలో మెరిసింది. కేఫ్ లో మూడు గంటలు ఉన్నప్పుడు వాసు తన ప్రేయసి నాగలక్ష్మి ని పరిచయం చేస్తాడు ఆమెను చూసి.. మరో పెయిర్‌లో ఉన్న యాంకర్ రష్మి, అలాగే మిగతా హీరోయిన్లు జలస్ ఫీల్ అవుతారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఇక ప్రస్తుతం అనుష్క.. డైరెక్టర్ క్రిష్ జాగర్ల మూడీ డైరెక్షన్‌లో ఘాటి సినిమా షూట్ లో బిజీగా గడుతుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే రిలీజై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25న ఈ సినిమా ఆడియన్స్‌ను పలకరించనుంది.