టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఇన్నేళ్లు పుష్ప సిరీస్‌లతో బిజీగా గడిపాడు. ఇక పుష్ప 2 రిలీజైసక్సస్ అందుకున్న క్రమంలో సుక్కు మళ్ళీ పుష్పా 3తో బిజీ అవుతాడని అంతా భావించారు. అయితే పుష్ప 3 ఇప్పట్లో ఉండదని అల్లు అర్జున్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే సుకుమార్.. రామ్‌చరణ్ ప్రాజెక్ట్ పని మొదలుపెట్టాడు. గతంలో ఆర్సి17 ప్రాజెక్ట్‌గా దీని ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ కాంబో గతంలో రంగస్థలం వచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం చేరణ్.. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో ఆర్సి 17లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా షూట్ సరవేగంగా పూర్తిచేసి సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఇక ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తుండగా.. ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రెండు స్కెడ్యూల్‌లు కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఆర్సి16 షూటింగ్ పూర్తైన వెంటనే.. సుకుమార్ సినిమా సెట్స్‌లో జాయిన్ కానున్నాడు చరణ్. ఇక పుష్ప 3 సక్సెస్ తర్వాత.. కొద్ది రోజులకి బ్రేక్ తీసుకున్న సుక్కు.. ప్రస్తుతం ఆరసి17 స్క్రిప్ట్ రెడీ చేయడంలో బిజీగా గడుపుతున్నాడు. త్వరలోనే సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు పెట్టనున్నారని సన్నిహిత వర్గాల సమాచారం. మైత్రీ మేకర్స్, సుక్కుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ గతంలో ఇస్తూ.. రెండు గుర్రాలు ఉన్న పోస్టర్ను రిలీజ్ చేశారు.
ఈ క్రమంలోనే తాజాగా సినిమాపై క్రేజీ బజ్ వైరల్‌గా మారుతుంది. చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్‌లో చేయబోతున్నాడట. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుందని.. ఇక బ్లాక్ బస్టర్ రంగస్థలంలానే ఈ సినిమా కూడా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రానుందని చెబుతున్నారు. గతంలో ఈ సినిమా గురించి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. గతంలో సుకుమార్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. పక్కా మట్టి వాసన సినిమా ఇది అంటూ కామెంట్‌లు చేశారు. ఇక పుష్ప సినిమాతో బన్నీ నేషనల్ అవార్డ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చరణ్ కూడా నేషనల్ అవార్డు అందుకునేలా సుకుమార్ కథను ప్లాన్ చేస్తున్నాడట. రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా అవగానే వీరిద్దరి ప్రాజెక్ట్ సెట్స్ పైకి రానుంది.