నాగార్జున – కాజల్ కాంబోలో మూవీ మిస్ అయిందని తెలుసా.. అదేంటంటే..?

అక్కినేని కింగ్ నాగార్జున.. టాలీవుడ్ మన్మధుడుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరిగా ఇప్పటికి రాణిస్తున్న నాగార్జున.. ఏడుపదుల వయసు దగ్గర పడుతున్న ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. తన ఫిట్‌నెస్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఓ పక్కన సినిమాల్లో రాణిస్తూనే.. మరో పక్కన బిజినెస్ లు, బ్రాండ్ ప్రమోషన్స్, బిగ్ బాస్ హోస్టింగ్ ఇలా బిజీబిజీగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో నాగార్జున సినిమాల విషయంలో కాస్త వెనుకబడిన.. ఆయన క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు.

Watch Ragada | Prime Video

ఇక ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. స్టార్ హీరోయిన్గా అతి తక్కువ సమయంలోనే క్రేజ్‌ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దాదాపు.. దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికి టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌తో దూసుకుపోతుంది. ఇలాంటి క్రమంలో నాగార్జున, కాజల్ అగర్వాల్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌ అవుతుంది. గతంలో వీళ్ళిద్దరి కాంబోలో సినిమా రావాల్సి ఉండగా.. అది చివరి నిమిషంలో మిస్ అయిందట.

The Ghost Movie Review: Nagarjuna and Sonal Chauhan shine in this  half-baked film

ఇంతకీ అసలు ఆ సినిమా ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. గతంలో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన రగడ సినిమా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో అనుష్క, ప్రియ‌మణి హీరోయిన్గా మెరిశారు. అయితే మొదట ఈ సినిమాల్లో ప్రియమణి రోల్ కోసం కాజల్‌ను భావించారట. అనివార్య కారణాలవల్ల కాజల్ ను ఈ సినిమా నుంచి తప్పించి.. ప్రియ‌మణిని టీం తీసుకున్నట్లు సమాచారం. ఇక నాగార్జున ది గోస్ట్.. అనే సినిమాలోను సోనాల్ చౌహాన్ ఆయనకు జంటగా కనిపించింది. కాగా మొదట ఈ సినిమాలో కూడా నాగార్జున‌కు జంటగా కాజల్‌ను భావించారట. అయితే ఈ సినిమా కూడా చివరి నిమిషంలో సోనాల్ చౌహాన్‌కు వెళ్ళింది. అలా.. నాగార్జున రెండు సినిమాలు ఇప్పటివరకు చివరి నిమిషంలో మిస్ అయినట్లు సమాచారం.