పవర్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత ఆయన సినిమాల రిలీజ్ డేట్ లకు అస్సలు క్లారిటీ ఉండడం లేదు. సినిమాలో మొదలయ్యే సమయంకి, రిలీజ్ డేట్ మొదట అనౌన్స్ చేసిన సమయానికి.. రిలీజ్ అయ్యే సమయానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. వేరువేరు కారణాలతో ఆయన సినిమాలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు సినిమా ప్రారంభమై నాలుగు సంవత్సరాలు అయినా.. సినిమా థియేటర్లలో ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా క్లారిటీ లేదు.
మార్చి 28న సినిమా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసినా.. ఇప్పుడు దానిపై కూడా క్లారిటీ లేదు. ఇక తాజాగా అవదుతున సమాచారం ప్రకారం.. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ మరోసారి వాయిదా పడనుందని టాక్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కారణంగా హరి హర వీరమల్లు సినిమా మరోసారి వాయిదా పడబోతుందని సమాచారం. ఇక యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ కెరీర్ కూడా ఈ సినిమా పైన ఆధారపడి ఉంది.
ఈ క్రమంలోనే పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. షూట్లో పాల్గొనడానికి పరిస్థితులైతే అనుకులించడం లేదని చెప్పాలి. ఇక పవన్ తన కెరీర్ ను ముందు ముందు ఎలా ప్లాన్ చేసుకుంటాడో.. షూట్‌ను ఎలా కంప్లీట్ చేస్తాడో వేచి చూడాలి. అయితే అసెంబ్లీ సమావేశాలు దగ్గర పడుతున్న క్రమంలో అప్పుడు కూడా చోట్ల పాల్గొంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని పవన్ ఆలోచిస్తున్నారని టాక్. ఈ క్రమంలోని హర హర వీరమల్ల షూట్ ఎప్పటికి పూర్తి చేస్తాడో.. అనౌన్స్ చేసిన టైంకు సినిమా రిలీజ్ అవుతుందో.. లేదో.. వేచి చూడాలి.