ఆ రోజు రాత్రి బాలయ్య తుపాకీతో సూసైడ్ చేసుకునేవాడు.. డాక్ట‌ర్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అటు సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్న బాలయ్య.. రాజకీయాలలోను హ్యాట్రిక్ తో రాణిస్తున్నాడు. మరోపక్క.. బుల్లితెరపై హోస్ట్‌గాను దూసుకుపోతున్నాడు. ఇక త్వ‌ర‌లో బాలయ్య నుంచి డాకు మహారాజు సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాపై.. ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయన‌ సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని బాలయ్యకు సంబంధించిన షాకింగ్ న్యూస్ నెటింట వైరల్ అవుతుంది.

Kakarla Shocking Revelation on Balayya! | cinejosh.com

గతంలో బాలకృష్ణ ఓసారి తుపాకితో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడంటూ.. డాక్టర్ కాకర్లమూడి సుబ్బారావు చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ప్రముఖ రేడియాలజీస్ట్.. నిమ్స్ ఆసుపత్రి స్థాపనకు కీలకపాత్ర పోషించిన‌ డాక్టర్ కాకర్ల సుబ్బారావు గతంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. వైద్య రంగంలో కాకర్ల సుబ్బారావు ఎనలేని ఖ్యాతిని సంపాదించుకున్నారు. ఇలాంటి క్రమంలో కాకర్ల సుబ్బారావు గతంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొని చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఆయన చనిపోయిన తర్వాత యూట్యూబ్లో ఈ వీడియో అప్లోడ్ కావడంతో.. ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Balakrishna New Movie with Bellamkonda

ఇక ఇంటర్వ్యూలో ఎవరికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సుబ్బారావు వెల్లడించారు. ముఖ్యంగా బాలయ్య, బెల్లంకొండ సురేష్ మధ్య జరిగిన కాల్పుల ఘ‌ట‌న‌పై ఏమాత్రం దాపరికం లేకుండా రియాక్ట్ అయ్యాడు. ఇక దీనిపై కాకర్ల మాట్లాడుతూ.. ఆరోజు ఈ ఘటనలో బాలకృష్ణ కాల్పులు జరపకపోయి ఉంటే.. గన్తో తనను తానే కాల్చుకొని సూసైడ్ చేసుకునేవాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక సుబ్బారావు మాట్లాడుతూ.. నా మనసులో ఏదో విధంగా తనని కాపాడాలని అనుకున్నా.. అందువల్ల ఇద్దరు అనుభవం ఉన్న సైకియాట్రిస్టులను పిలిపించి చూడమన్నా.. అతను ఆ విధంగా చేసి ఉండకపోతే తనని తాను కాల్చుకునేవాడని.. అందుకోసమే ఆ టైంలో అలా చేయాల్సి వచ్చింది అని కాకర్ల సుబ్బారావు చెప్పిన వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారుతుంది.