సాధారణ వ్యక్తులతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన జనాలు, వాళ్ళ అభిమానులు కూడా సెంటిమెంట్లను నమ్ముతూ ఉంటారు. అలా కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఫేవరెట్ హీరోల సినిమాలకు ఏదైనా బ్యాడ్ సెంటిమెంట్ ఉందనిపిస్తే.. దానిపై ఫ్యాన్స్ టెన్షన్ పెంచేసుకుంటారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో బాలయ్య, చరణ్ సినిమాల విషయంలో అభిమానులకు టెన్షన్ నెలకొంది. 2025 సంక్రాంతికి బాలయ్య, చరణ్ లను వెంకటేష్ భయపెడుతున్నాడా.. పెద్దగా ఫామ్ లో లేని వెంకటేష్ చరణ్, బాలయ్యను కలవరపెట్టడం ఏంటి అనుకుంటున్నారా.. అదేంటో ఒకసారి చూద్దాం.
ఈ ఏడది బాలకృష్ణ డాకు మహారాజు, రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలతో పాటు.. విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే బాలయ్య, రామ్ చరణ్ సినిమాలపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే 2019 సంక్రాంతి సెంటిమెంట్ గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. 2019లో చరణ్ నుంచి వినయ విధేయ రామ, బాలయ్య నుంచి ఎన్టీఆర్ కథానాయకుడు, వెంకటేష్ నుంచి ఎఫ్ 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఎన్టీఆర్ బయోపిక్ కావడంతో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అలాగే చరణ్, బోయపాటి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో వినయ విధేయ రామ ప్రోమోలు, ట్రైలర్ చూసిన ఆడియన్స్ లో సినిమాపై హైప్ పెరిగింది.
కాగా ఎలాంటి అంచనాలు లేకుండా వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ ఎఫ్2 రిలీజ్ అయింది. ఇక సినిమాకు దర్శకుడుగా వ్యవహరించిన అనిల్ రావిప్పుడికి అప్పట్లో చెప్పుకోదగ్గ ఫేం కూడా లేదు. ఇలాంటి క్రమంలో విపరీతమైన హైప్ తో వచ్చిన వినయ విధేయ రామ, ఎన్టీఆర్. .కథానాయకుడు సినిమాలకు.. ఎఫ్2 పెద్ద షాక్ ఇచ్చింది. బాలయ్య, చరణ్ సినిమాలు రెండు డిజాస్టర్లుగా నిలిచాయి. మరోపక్క వెంకటేష్ ఎఫ్2 బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా మంచి సక్సెస్ సాధించింది. ఈ క్రమంలోనే 2025 లో మరోసారి సంక్రాంతి బరిలో బాలయ్య, చరణ్, వెంకటేష్ పోరుకు సిద్ధమవుతున్నారు. అయితే 2019 సీన్ మళ్లీ రిపీట్ అయితే బాలయ్య చరణ్ సినిమాల పరిస్థితి ఏంటి అంటూ.. ఇక వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే.. ఆ ఎఫెక్ట్ కచ్చితంగా చరణ్, బాలయ్య సినిమాలపై పడుతుంది.. ఈ క్రమంలోనే డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్ సినిమాల రిజల్ట్ పై ఫ్యాన్స్‌లో టెన్షన్ మొలైందట.