ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెట్టి స్టార్ హీరోలుగా సక్సెస్ సాధించడానికి ఎంతో మంది అరటపడుతుంటారు. కానీ ఎక్స్‌పరిమెంటల్ సినిమాల్లో నటించే సాహసం మాత్రం అతి తక్కువ మంది హీరోలు మాత్రమే చేస్తారు. ప్రయోగాలు చేసిన ఒక లిమిట్ దాటి నటించడానికి అసలు ఇష్టపడరు. కానీ.. హీరో ఉపేంద్ర మాత్రం ఈ హీరోలకు కాస్త భిన్నంగా ఉంటాడు. కంటెంట్ నచ్చితే.. ఎలాంటి ప్రయోగాత్మక సినిమా చేయడానికి అయినా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఈ క్రమంలోనే తాజాగా ఉపేంద్ర నటించిన మూవీ యూఐ రిలీజైంది. ఇక ఈ సినిమా ఫస్ట్ డిస్క్లైమర్ మీరు ఇంటలిజెంట్ అనుకుంటే.. థియేటర్ నుంచి బయటకు వెళ్ళండి అని వేశారు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. సినిమా ఎలా ఉండబోతుందో.. డిస్క్లైమర్ ద్వారా చెప్పకనే చెప్పేశారు మేకర్స్.
రియల్ టైం ప్రాబ్లమ్స్, హాట్ హిట్ ఫ్యాక్స్‌తో రూపొందిన ఈ సినిమా డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కింది. ఉపేంద్ర సినిమాలను ఇష్టపడే వారికి కచ్చితంగా నచ్చుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఉపేంద్ర స్వీయ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. తాజాగా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. ఉపేంద్ర సినిమాలు నచ్చే ఆడియన్స్‌ను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక హీరో వన్ మ్యాన్ షో అంటూ సినిమా చూసిన ఆడియన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా టేకింగ్ లో చూపించిన డిఫరెన్స్ సినిమాకు ప్లస్ అయింది. ఇక థియేటర్‌లో వీకెండ్‌కు మంచి సినిమా చూడాలనుకునే ఆడియన్స్ కు ఈ సినిమా మంచి ఆప్షన్.
యూఐ సినిమాతో ఉపేంద్ర మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ సాధించడం ఖాయం అనేట్లుగా సినిమా టాక్ వినిపిస్తుంది. ఇక సినిమా ఆడియన్స్ ఇంటెలిజెన్స్‌ను పరీక్షించే సినిమా. చూసిన ఆడియన్స్ నుంచి టాక్ కూడా అదిరిపోతుంది. సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక కంటెంట్ కొత్తగా ఉండడం సినిమాకు మరింత ప్లస్ అయింది. ఇప్పటికే ప్రేక్షకుల మంచి హైట్ సాధించిన సినిమా బుకింగ్స్ లోను దూసుకుపోతుంది. ఫస్ట్ వీకెండ్ లోనే యుఐ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయం అనిపిస్తుంది. ఉపేంద్ర లుక్స్ సైతం ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.