బ్యానర్: లహరి ఫిలింస్, వీనస్ ఎంటర్టైనర్స్
టైటిల్: UI
నటీనటులు: ఉపేంద్ర, రీష్మా నానయ్య, ఇంద్రజిత్ లంకేష్ తదితరులు
సినిమాటోగ్రఫీ: హెచ్‌సీ. వేణు
ఫైట్స్: థ్రిల్లర్ మంజు, రవివర్మ, చేతన్ డిసౌజా
ఎడిటింగ్: విజయ్ రాజ్
మ్యూజిక్: అజనీష్ లోకనాథ్
నిర్మాతలు: జీ మన్మోహన్, శ్రీకాంత్ కేపీ
రచన – దర్శకత్వం: ఉపేంద్ర
సెన్సార్ రిపోర్ట్ : U / A
రన్ టైం: 130 నిమిషాలు
రిలీజ్ డేట్ : 20 డిసెంబర్, 2024
కన్నడ స్టార్ ఉపేంద్ర అంటే తెలుగులో 25 ఏళ్ల క్రితమే తిరుగులేని క్రేజ్ ఉండేది. ఉపేంద్ర చాలా గ్యాప్ తర్వాత నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా UI. ఉప్పీ గత సినిమాల్లాగే యూఐ కూడా డిఫరెంట్‌గా ఉండబోతోందని ఇప్పటికే రిలీజైన టీజర్లు, ట్రైలర్లు చెప్పేశాయి.ఉపేంద్ర సినిమాల టైటిల్స్ అంటే ఏ – రా – సూపర్ ఇలా డిఫరెంట్‌గా ఉంటాయి. తాజాగా UI సినిమా టైటిల్‌తో పాటు టీజర్లు ఆకట్టుకున్నాయి. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత వరకు వర్క్ అవుట్ అయ్యింది? ఫ్యాన్స్, కామన్ ఆడియెన్స్ ఏమనుకుంటున్నారో చూద్దాం.
స్టోరీ :
డే/నైట్ సత్య(ఉపేంద్ర) వర్సెస్ కల్కి భగవాన్ కాన్సెప్ట్ తో ఈ మూవీ రూపొందింది. 2040లో ప్రపంచం ఎలా ఉండబోతుందనే కాన్సెప్ట్ తో సెటరికల్ విధానంలో రూపొందించిన ఈ సినిమాకు దర్శకుడిగా, హీరోగా ఉపేంద్ర వ్యవహరించారు. తన వైవిధ్యమైన టేకింగ్ తో మరోసారి వింటేజ్ ఉపేంద్ర గుర్తుకొస్తాడు. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే హీరోయిన్ లవ్ ట్రాక్ లో.. ఉపేంద్ర వింటేజ్ సైకో లవ్ ట్రాక్ మరోసారి గుర్తుచేశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాక్ అదిరిపోయే విజువల్ ట్రీట్‌తో ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో వచ్చే సాంగ్స్ కూడా సెటరికల్ గా అనిపించినా.. ప్రస్తుతం నడుస్తున్న ట్రైండ్‌కు తగ్గట్టు పాటలు రూపొందించారు. సినిమాలోని ఎపిసోడ్ ప్రపంచంలో ఇంతవరకు ఏ డైరెక్టర్ కూడా తీయని రేంజ్ లో ఉపేంద్ర క్రియేట్ చేశాడు. ఇది థియేటర్లలో చూస్తే ఆ మజానే వేరు.
విశ్లేషణ :
డైరెక్టర్‌గా ఉపేంద్ర తన డిఫరెంట్ టేకింగ్ తో మరోసారి సత్తా చాటుకున్నాడు. ఇక సినిమాలోని అన్ని సీన్స్ ఒక ఎత్తు అయితే.. క్లైమాక్స్ మరో లెవెల్. ఈ సినిమాకు రెండు డిఫరెంట్ క్లైమాక్స్ లు పెట్టాలని ఆలోచన సరికొత్తగా ఉంది. నిజంగా దానికి హాండ్స్ అప్ చెప్పాల్సిందే. 2024 కల్కి ఎపిసోడ్ సినిమాకి హైలెట్. హీరోయిన్‌తో సైకో లవ్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. పెద్దది.. చిన్నది.. సాంగ్ పిక్చర్ రిజేషన్ మెప్పిస్తుంది. టెంపుల్ ఫైట్, ఎలక్షన్ లీడర్స్ ఫైట్, దర్శకుడు ఉపేంద్ర – కల్కి మధ్య ఆర్గ్యుమెంట్ సీన్స్ సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. ఇక సినిమాలో క్యారెక్టర్‌తో డైరెక్టర్ ఆర్గ్యూ చేయడం.. సినీ చరిత్రలోనే మొట్టమొదటిసారి. ఇకపై కూడా ఎవరు ఇలా చేయలేరు అన్నట్లుగా దాని రూపొందించాడు.
మేకింగ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే ఉపేంద్ర యూఐ సినిమా వన్ మాన్ షో. ఇక సినిమా మొదటినుంచి తుది వరకు స్టోరీ అంత ఉపేంద్ర చుట్టూనే తిరుగుతుంది. ఉపేంద్ర డైరెక్టర్ గానే కాదు.. నటనతో కూడా మంచి మార్కులు సంపాదించుకున్నాడు. వరల్డ్ వైడ్గా ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటిని స్క్రీన్ పై చూపించడంలో సక్సెస్ సాధించాడు. మీరు ఇంటిలిజెంట్ అనుకుంటే వెంటనే ధియేటర్ నుంచి వెళ్ళిపోండి అంటూ డిస్క్లైమెర్‌లో ప్రేక్షకులకు సవాలు విసిరిన ఉపేంద్ర.. రియల్ టైం ప్రాబ్లమ్స్ తో, హాట్ హిట్ ఫ్యాక్ట్స్‌తో పిక్స్ లెవెల్ కటెంట్ చూపించాడు. ఇలాంటి కథలు ఉన్న సినిమాలు రావడం చాలా తక్కువ. ఇక ఇండియన్ దశాబ్దంలో ఇలాంటి సినిమా రావడం నిజంగా గొప్ప విషయం.
రేటింగ్ :
3/5