ఈ పై ఫోటోలో కనిపిస్తున్న సౌత్ ఇండియన్ స్టార్ హీరోని గుర్తుపట్టారా.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఓ సాధారణ కుర్రాడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఎన్నో సవాళ్లు అవమానాలను ఎదుర్కొన్న తర్వాత.. స్టార్ హీరోల రేంజ్‌కు ఎదిగాడు. తెలుగు, తమిళ్లో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమా నటించి మెప్పించిన ఈ హీరో.. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్నాడు. సౌత్ ఇండస్ట్రీలోనే విపరీతమైన ఫ్యాన్ వేసి సంపాదించుకున్న వారిలో ఇతను ఒకడు. ఇంతకీ ఈ హీరో ఎవరో చెప్పలేదు కదా.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్.
1971 మే 1న సికింద్రాబాద్ లో జన్మించిన అజిత్ మొదటి నుంచి చదువుపై ఆసక్తి లేకపోవడంతో.. టెన్త్ క్లాస్ పూర్తి చేసి బైక్ మెకానిక్ గా కొంతకాలం పనిచేశాడు. అయితే చదువుపై పట్టు లేకున్నా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగాడు. ఇక కేవలం హీరోనే కాదు.. ప్రొఫెషనల్ రేసర్ కూడా. 2004లో బ్రిటిష్ ఫార్ములా 3, ఫార్ములా 2 రేసుల్లో పాల్గొని సందడి చేశాడు. అజిత్ ప్రొఫెషనల్ షూటర్ కూడా.. తమిళనాడులో జరిగిన ఛాంపియన్షిప్‌లో ఆయన నాలుగు బంగారు పథకాలను సొంతం చేసుకున్నాడు. ఇక ఆయన విమానాన్ని సైతం నడపగలరు.
మొదట బైక్ మెకానిక్ గా వ్యవహరించి.. తర్వాత ట్రైలర్ షాపులో సేల్స్మెన్ గా.. తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో పనిచేశాడు. గర్మెంట్ కంపెనీలో అప్రెంటీస్‌గా చేరి బిజినెస్ డెవలపర్గా వర్క్ చేస్తూ.. ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. సొంతంగా టెక్స్ టైల్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఒక మోటార్ కంపెనీ కమర్షియల్ యాడ్ చేయడానికి.. అజిత్ వెళ్ళినప్పుడు ఫోటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ పి.సి శ్రీరామ్ ఓ సినిమాలో అవకాశాన్ని ఇవ్వడం.. 1990 ఎన్‌వీడు.. ఎన్ కనవర్.. మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాల్లో సైడ్ క్యారెక్టర్‌కు రూ.2500 రెమ్యునరేషన్ తీసుకున్న తర్వాత.. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూనే హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. 2000 సం..లో తన సహనటి బేబీ శాలినిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో ఆడియన్స్ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు.