సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీల్ గా నటిస్తున్న ఎంతో మంది కథ నచ్చి.. కంటెంట్ ఉందనిపిస్తే ఆ సినిమాలో పాత్ర డిమాండ్ చేస్తే.. తమను తాము ఎలా మార్చుకోవడానికి అయినా సిద్ధపడుదూ ఉంటరు. అలా సిక్స్ ప్యాక్ లు పెంచడం, గడ్డాలు పెంచడం, లావు పెరగడం, తగ్గడం, గుండు కొట్టించుకోవడం ఇలా ఎన్నో విధాలుగా మారిపోతూ ఉంటారు. కానీ.. ఆ హీరోలు.. లేడీ గెటప్లు వేయడం.. ట్రాన్స్ జెండర్లు గా చేయడం లాంటి సాహసాలు చేయడానికి మాత్రం వెనుకడుతుంటారు. ఇలాంటి పాత్రలో చేయవలసివస్తే ఎలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో ఆయినా నో చెప్పేస్తు ఉంటారు.
అయితే కొందరు హీరోలు మాత్రం దేనికైనా సై అని సిద్ధమవుతారు. వారిలో ఈ పై ఫోటోలో ఉన్న హీరో కూడా ఒకరు. వైవిద్యమైన క్యారెక్టర్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ యంగ్ హీరో.. ఇటీవల రిలీజ్ అయిన ఓ సూపర్ హిట్ సినిమాలో ఏకంగా ట్రాన్స్జాండర్ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. వర్స్‌టైల్ హీరోగా తన సత్తా చాటుకున్నాడు. థియేటర్లో ఏ సినిమా రిలీజైనెగెటీవ్ టాక్ తెచ్చుకున్నా.. తాజాగా ఓటీడీలో వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఓటిటిలో సినిమా చూసిన ఆడియన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు. ట్రాన్స్ జెండర్ రోల్‌లో హీరోని చూసే షాక్ అవుతున్నారు.
ఇంతకీ హీరో ఎవరో చెప్పలేదు కదా.. తనే శ్రీ విష్ణు. హసిత్ కొల్లి డైరెక్షన్లో తెరకెక్కిన స్వాగ్ సినిమాలో శ్రీ విష్ణు ఏకంగా ఐదు పాత్రలో నటించాడు. మహారాజు, పోలీస్‌ఆఫీసర్, యువకుడు, డ్యాన్సర్, అలాగే ట్రాన్స్ జెండర్, ముసలివాడి పాత్రలో ఆకట్టుకున్నాడు. ఒకే సినిమాలో ఎన్నో పాత్రల్లో వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడం అంటే సాధారణ విషయం కాదు. మేకప్ డిఫరెన్స్ తోను ప్రేక్షకులను మెప్పించాడు. ముఖ్యంగా ట్రాన్సిడర్ పాత్రలో ఆడియోస్ ను షాక్ చేశాడు. ఈ క్రమంలోని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ట్రాన్స్‌జండర్ విభూతి పాత్రకు సంబంధించిన ఫోటోలే వైరల్ గా మారుతున్నాయి. శ్రీ విష్ణు నటనపై తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు ఆడియన్స్.