త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ కావడానికి కారణం ఆ ఫేడ‌వుట్ హీరోనే.. ఇదే ట్విస్ట్‌..!

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను తెర‌కెక్కించే ప్రతి సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న త్రివిక్రమ్ గ‌తంలో అజ్ఞాతవాసి సినిమాతో పెద్ద‌ ఫ్లాప్ను చెవిచూశాడు. ఇక ఈ మూవీ ఫెయిల్ కావ‌డంతో.. త్రివిక్ర‌మ్‌ కెరీర్ అయిపోయిందని అంత భావించారు. అలాంటి టైం లో వరుసగా అరవింద సమేత, అలవైకుంఠపురంలో, గుంటూరు కారం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెర‌కెక్కించి హ్యాట్రిక్ స‌క్స‌స్ తన ఖాతాలో వేసుకుని.. మరోసారి తన సత్తా చాటుకున్నాడు. కాగా త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్‌గా ఈరేంజ్‌కు ఎదగడానికి కారణం మాత్రం ఓ ఫేడౌట్ హీరో అంటూ న్యూస్ వైర‌ల్ అవుతుంది. ఇంతకీ ఆ హీరో ఎవరు.. త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ అవడానికి ఆ హీరోకు మధ్య లింక్ ఏంటో ఒకసారి చూద్దాం.

Swayamvaram – Movies on Google Play

త్రివిక్రమ్ సినీ ఇండస్ట్రీకి రచయితగా పరిచయమైన సినిమా స్వయంవరం. ఒకప్పటి స్టార్ హీరో వెణుకు కూడా ఇదే మొదటి సినిమా కావడం విశేషం. అయితే ఈ సినిమాలో వేణు తన నటనతో నంది అవార్డును దక్కించుకున్నాడు. మరిన్ని రికార్డులను క్రియేట్ చేశాడు. మంచి సక్సెస్ అందుకోవడంతో సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన వేణు స్నేహితుడు వెంకట శ్యామ్ ప్రసాద్కు కూడా లాభాల వర్షం కురిసింది. ఈ సినిమా కోసం శ్యాం ప్రసాద్ ఎస్పీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ను స్థాపించి మరి సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా అప్పట్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే వేణు తన సొంత సినిమాలను నటిస్తూ బిజీ అయ్యారు. అలా చిరునవ్వుతో, చెప్పవే చిరుగాలి, హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు లాంటి ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలతో ఆకట్టుకున్నాడు.

కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో సినిమాలకు దూరమైన వేణు.. చాలా కాలం గ్యాప్ తర్వాత దమ్ము సినిమాతో మరోసారి ప్రేక్షకు ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఊహించిన సక్సెస్ అందుకోకపోవడంతో మరికొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన వేణు.. చివరిగా రవితేజ రామారావ్ ఆన్‌ డ్యూటీ సినిమాలో తళ్ళుకున మెరిసి మాయమయ్యాడు. ఇదిలా ఉంటే కెరీర్‌ను రైటర్ గా త్రివిక్రమ్.. హీరోగా వేణు ఒకేసారి ప్రారంభించినా వేణు మాత్రం ఫేడౌటెడ్ హీరోగా మిగిలిపోయాడు. ఇక్క‌డ ట్విస్‌ట్ ఏటంటే త్రివిక్రమ్ మాత్రం ఇప్పటికీ మంచి క్రేజ్‌తో టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. ఏదేమైనా త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ గా మారెందుకు ఇన్ డైరెక్ట్ గా వేణు కూడా ఒక కారణం అనడంలో అతిశయోక్తి లేదు. కెరీర్ ప్రారంభంలో వేణు.. త్రివిక్రమ్ కు వరుస సినిమాలో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాడు అన్నది వాస్తవం. ఈ క్రమంలోని త్రివిక్రమ్ కు మంచి కెరీర్ ఇచ్చిన వేణు ఫెడ్ అవుట్ అవ్వడం అందరికీ షాక్‌ కలిగిస్తుంది.