మలయాళీ స్టార్ నటుడు మమ్ముట్టి.. నటవారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి హీరోగా తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు దుల్కర్ సల్మాన్. మలయాళంలో ఎన్నో హిట్ మూవవీస్‌లో నటించిన దుల్కర్ తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. దివంగత స్టార్ హీరోయిన్ సావిత్ర జీవితకథ అధారంగా వచ్చిన మహానటి తో తెలుగు తెరకు పరిచమయిన ఈ హీరో.. తర్వాత డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో అందమైన ప్రేమకథగా తెరకెక్కిన సీతారామం తో భారీ సక్సస్ అందుకున్నాడు. ఈ సినిమాతో తెలుగు అడియన్స్ హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న దుల్కర్ తాజాగా దీపావళి పండగ సందర్భంగా లక్కీ భాస్కర్ తో ఆడియన్స్‌ను పలకరించాడు. ఈసినిమాకు ప్రస్తుతం పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో లక్కీ భాస్కర్ ప్రమోషన్‌లలో.. అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొని సందడి చేశాడు దుల్కర్ సల్మాన్.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఈ టాక్ షో ఇప్పటికీ 3సీజన్లు పూర్తి చేసి.. 4వ సీజన్ విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ షో మొదటి ఎపిసోడ్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అతిథిగా వచ్చాడు. అలాగే రెండో ఎపిసోడ్ లో లక్కీ భాస్కర్ టీమ్ పాల్గొన్నారు. హీరో దుల్కర్‌తోపాటు, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ వెంకీ అట్లూరి, ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా ఈ షోలో సందడి చేశారు. ఇక ఇప్పుడు రెండో ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో తన లవ్ స్టోరీని దుల్కర్ సల్మాన్ షేర్ చేసుకున్నాడు. అమల్ సూఫియా అనే అమ్మాయిని ప్రేమించా దుల్కర్ సల్మాన్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇక దుల్కర్ మాట్లాడుతూ “తను నా స్కూల్ జూనియర్.. నేను 12వ తరగతిలో ఉన్నప్పుడు తను 8వ తరగతి.. అప్పుడూ మాట్లాడుకునేవాళ్లం కాదు. కానీ.. అప్పుడప్పుడు తనను చెన్నైలో థియేటర్స్, రెస్టారెంట్స్‌లో చూసేవాడని. పరిచయం ఉండేది. కానీ.. ఎక్కువగా మాట్లాడుకోలేదు. ఇంట్లో మ్యాచెస్ చూస్తున్న టైంలో నేను ఆమెకు ఫేస్‌బుక్‌లో మెసేజ్ చేశా. ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. మీ ఇంట్లో కూడా చూస్తుంటారు.. మనం ఒకసారి కలిసి మాట్లాడుకుందాం అని మెసేజ్ పెట్టా. తర్వాత మూడు వారాల్లోనే మా నిశ్చితార్థం అయిపోయింది. మా పెళ్లి జరిగి 13 సంవత్సరాలు అవుతుంది” అంటూ దుల్కర్ సల్మాన్ వివరించాడు.