నందమూరి నట సింహం బాలకృష్ణ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఐదు దశాబ్దాలైనా ఇప్పటికీ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 108 సినిమాల్లో నటించిన బాలయ్య.. ఎన్నో సినిమాలతో ఇండస్ట్రీ హిట్‌లు అందుకున్నాడు. ఈ క్రమంలో బాలయ్య ఎన్నో కథలను కూడా రిజెక్ట్ చేశాడు. ఆ కథలు వేరే హీరోలకు వెళ్లి వాళ్ళు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇంతకీ ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.
సింహాద్రి:
ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సినిమాల్లో సింహాద్రి ఒకటి. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. అయితే ఈ సినిమాకు కథను విజయేంద్ర ప్రసాద్ అందించారు. మొదట బాలకృష్ణ కోసమే ఈ సినిమా కథను రాసుకున్నారట. స్టోరీని బాలకృష్ణకు వినిపించగా గతంలోనే ఈ జోనర్‌లో చేశానని.. కథను రిజెక్ట్ చేశాడు. దీంతో ఈ కథలోనే ఎన్టీఆర్ హీరోగా నటించి హిట్ అందుకున్నాడు.
చంటి:
విక్టరీ వెంకటేష్ హీరోగా, మీనా హీరోయిన్గా తర్కెక్కి మంచి సక్సెస్ అందుకున్న చంటి మూవీ ఇప్పటికీ ఎంతమంది ఆడియన్స్ కు ఫేవరెట్ మూవీగా నిలిచిపోయింది. అయితే ఈ సినిమా మొదట బాలకృష్ణతో చేయాలని అనుకున్నారట. కానీ బాలయ్య రిజెక్ట్ చేయడంతో వెంకటేష్‌కు ఆ కథ వెళ్లి ఆ మూవీ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు వెంకటేష్.
జానకి రాముడు:
టాలీవుడ్ దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర డైరెక్షన్లో.. నాగార్జున హీరోగా , విజయశాంతి హీరోయిన్గా తెరకెక్కిన మూవీ జానకి రాముడు. బాలయ్యతో ఈ మూవీ చేయాలని మేకర్స్ భావించారట. కానీ.. బాలయ్య సినిమాను రిజెక్ట్ చేశాడు. నాగార్జున సినిమాలో నటించి బ్లాక్ బాస్టర్ ఖాతాలో వేసుకున్నాడు.
సింహరాశి:
యాంగ్రీ యంగ్‌మ్యాన్ రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన సింహరాశి సినిమాను కూడా మొదట బాలయ్య అనుకున్నారు. కానీ.. ఎవో కారణాలతో బాలయ్య సినిమాను రిజెక్ట్ చేశాడు. దీంతో రాజశేఖర్ సినిమాలో నటించి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కూడా దక్కించుకున్నాడు.
క్రాక్:
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా తెరకెక్కిన క్రాక్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మొదట గోపీచంద్ ఈ సినిమాను బాలయ్యతో చేయాలని భావించాడట. ఆయన నో చెప్పడం..తో రవితేజతో ఈ సినిమాను చేశారు.