ముగ్గురు హీరోయిన్లతో రాసిన కథ.. అలాంటి కారణంతో ఓ హీరోయిన్ క్యారెక్టర్ తీసేసిన జక్కన్న..

ఇండస్ట్రీలో చాలా వరకు దర్శక, రచయితలు సినిమాను తరికెక్కించే ముందే హీరోను ఊహించుకుని కథలు రాయడం ప్రారంభిస్తారు. అలా కథ పూర్తి అయిన తర్వాత హీరోకు కథను వినిపించి.. అది వర్కౌట్ అయితే ఓకే. ఒకవేళ వారి కాంబో సెట్ కాకపోతే.. అదే కథతో డైరెక్టర్ మరో హీరోను పెట్టి సినిమా చేయాల్సి ఉంటుంది. అలాంటి క్రమంలో ఆ హీరో ఇమేజ్‌కు తగ్గట్టుగా కథలో మార్పులు.. చేర్పులు.. చేయడం సహజం. ఒక్కోసారి హీరో ఇమేజ్ను బట్టి చాలా వరకు క‌థ‌ను మార్చేయాల్సి వస్తుంది.

Simhadri (2003) - IMDb

అలా గతంలో నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలో జరిగిందట. గతంలో నందమూరి నట‌సింహం బాలకృష్ణ కోసం రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఓ కథ‌ను రాసుకొని.. ఆయనకు వినిపించాడట. కథ మొత్తం విన్న బాలయ్య.. గతంలో ఇలాంటి కథతో ఎన్నో స్టోరీలు తెర‌కెక్కాయి.. ఇప్పుడు మళ్లీ ఇదే తరహా సినిమాలో నటిస్తే అది హిట్ అయ్యే అవకాశం చాలా తక్కువ. అందుకే ఈ కథలో నటించడం కుదరదని రిజెక్ట్ చేశాడట. దీంతో విజయేంద్ర ప్రసాద్ ఆ కథలు పక్కన పడేశారు.

Prime Video: Simhadri

అయితే బాలకృష్ణ కోసం క‌థ వినిపించిన క్రమంలో ఈ సినిమాల్లో ముగ్గురు హీరోయిన్ల క్యారెక్టర్లు ఉండేవట. ఇక కొంతకాలం తర్వాత రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ రాసిన కథను చూసి.. అది ఎంతగానో నచ్చడంతో.. దానిని వదిలేయడం ఇష్టం లేక.. జూనియర్ ఎన్టీఆర్‌ను హీరోగా పెట్టి ఆ కథను తెర‌కెక్కించాలని భావించారు. దానికి సింహాద్రి అని టైటిల్ పెట్టినట్లు టాక్. ఇకపోతే బాలకృష్ణ కోసం ఈ కథలో ముగ్గురు హీరోయిన్లను డిజైన్ చేయగా.. జూనియర్ ఎన్టీఆర్ ను హీరోగా ఫిక్స్ అయిన తర్వాత రాజమౌళి ఈ సినిమాలో ఓ హీరోయిన్ క్యారెక్టర్ ను పూర్తిగా తొలగించారని సమాచారం. ఇక అలా రూపొందిన‌ సింహాద్రి సినిమా అప్పట్లో బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుని రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.