శ్రీజ మొదటి భర్తతో బిగ్‌బాస్ సోనియా ఎఫైర్… అప్ప‌టి సీక్రెట్లు ఇలా బ‌య‌ట‌ప‌డ్డాయ్‌..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన కుటుంబాన్ని ఎదిరించి మరీ శిరీష్ భరద్వాజ్‌ని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈమె పెళ్లి సమయంలో జరిగిన రచ్చ నెటింట తెగ వైరల్ గా మారింది. కాగా ఇప్పటికీ తన పెళ్లి టైంలో జరిగిన వీడియోస్ నెటింట‌ వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న శ్రీజ కొద్ది రోజులు భర్తతో బాగానే ఉన్నా తర్వాత కట్నం తేవాలని వేధింపులు ఎదురవుతున్నాయి అంటూ భర్తకు విడాకులు ఇచ్చేసి తండ్రి వద్దకు వెళ్ళిపోయింది. అలా మొదటి భర్తతో విడాకులు తీసుకున్న శ్రీజ రెండో పెళ్లి చేసుకున్నా.. అది కూడా నిలవలేదు. శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ ఈ మధ్యనే అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే.

Sreeja Konidela's Ex-Husband Sirish Bharadwaj Dead! - TrackTollywood

ఇక ఈ క్రమంలో శ్రీ‌జ.. భర్త శిరీష్ భరద్వాజ్‌కు బిగ్‌బాస్‌8 షోలో కంటెస్టెంట్‌గా వ్యవహరిస్తున్న ఆకుల సోనియాకు మధ్యన ఎఫైర్ ఉందంటూ వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ మేటర్ ఏంటో.. అసలు శ్రీజ మొదటి భర్తకు బిగ్ బాస్ సోనియాకు ఉన్న సంబంధం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఆకుల సోనియాకు, శిరీష్ భరద్వాత్ కు మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందట. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోస్ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతున్నాయి. అయితే వీరిద్దరి మధ్యన ఉన్న ఫ్రెండ్‌షిప్ ఎలా బయటపడింది అనుకుంటున్నారా.. శిరీష్ భరద్వాజ్ మరణించిన తర్వాత ఆకుల సోనియా ఓ సెన్సేషనల్ పోస్ట్ ని షేర్ చేసింది. ఆయన మరణం పట్ల సోనియా ఎంతగానో బాధపడుతున్నట్లు అందులో పేర్కొంది. ఆ పోస్ట్ లో ఏముందంటే ప్రియమైన నా స్నేహితుడా.. నాకు ఏదైనా ఆపద వస్తే హెల్ప్ చేయడానికి నువ్వు ముందుండే వాడివి.

ఇంత తొందరగా మమ్మల్ని విడిచి వెళ్లిపోతావని అస్సలు అనుకోలేదు.. ఎంత డిప్రెషన్ లో ఉన్నా అనారోగ్యంతో ఉన్న పైకి చాలా హ్యాపీగా ఉన్నట్లు కనిపించావు. మీ జీవితంలో జరిగిన పాస్ట్ నుంచి నువ్వు సెన్సిటివ్‌గా ఉండడంతో ఓవర్ క‌మ్‌ కాలేకపోతున్నా.. నీ జీవితంలో నుంచి.. నేను లైఫ్ చాలా చిన్నది అందరితో చియ‌ర‌ప్ అవుతూ యాక్టివ్‌గా ముందుకు సాగాలనేది నేర్చుకున్న. మిస్ యు అంటూ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసుకుంది. అయితే అది చాలా రోజుల కిందటి జరిగిన ట్విట్ అయినా.. అప్పట్లో సోనియా ఎవరికి తెలియక పోవడంతో ఈ విషయాలు ఏవి బయటకు రాలేదు. కానీ.. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా అమ్మడు మంచి పాపులారిటి దక్కించుకుంటుంది. ఈ క్రమంలోనే ఈమె చేసిన పోస్ట్‌ తెగ వైరల్‌గా మారుతుంది. దీంతో శ్రీజ మొదటి భర్తతో సోనియాకు ఎఫైర్ ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.