పాన్ ఇండియా లెవెల్ దేవర పేరు మారుమోగిపోతుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్క్రీన్‌పై వస్తుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ పాన్ ఇండియా లెవెల్ లో ఎన్టీఆర్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా.. తారక్ నుంచి ఆరేళ్ల గ్యాప్ తో వస్తున్న సోలో సినిమా కావడంతో.. సినీ లవర్స్‌లో సినిమాపై ఆసక్తి విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే విడుదలకు ముందే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన దేవర.. రిలలలలీజ్ తర్వాత కూడా మంచి వసూళ్లు రాబడుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఓవర్సీస్ ఫ్రీ సేల్స్ బాక్స్ ఆఫీస్ లో అత్యంత వేగంగా మిలియన్ యూఎస్ డాలర్లు మార్క్ దాటేసిన ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది. ఇటు ఇండియాలోనూ కాసుల వర్షం కురిపిస్తుంది. విడుదలకుముందే ఈ రేంజ్ లో రికార్డులు బ్లాస్ట్ చేస్తుంది దేవర.
అలా ఇప్పటికే దేవర ఉత్తర అమెరికాలో తొమ్మిది రాష్ట్రాల్లో రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రెండు మిలియన్ డాలర్లను రాబట్టింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, కెనడాలో ఏకంగా 40 వేల టికెట్లు గంటల వ్యవధిలోనే బుక్ అయిపోయాయి. అలా వాటితో మరో రెండు మిలియన్ డాలర్లు వచ్చినట్లే అని సమాచారం. అయితే అటు ఆంధ్ర, తెలంగాణ కూడా ప్రీ బుకింగ్ సేల్స్ ఓపెన్ చేయగా.. ఎక్కువ మొత్తంలో టికెట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ సినిమా రిలీజ్ కి ముందే భారీగా బిజినెస్ జరగడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జాన్వి కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు కొరటాల దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు 400 కోట్ల బడ్జెట్ అయినట్లు సమాచారం. కాగా ఇప్పటికే అన్ని విధాలా రూ.350 కోట్ల వరకు టీంకు రికవరీ అయిపోయిందట. ఇక అన్ని భాషల్లో శాటిలైట్ అమ్మకాల డీల్స్ పూర్తికాలేదు. ఇక హిందీలో సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటే వచ్చే ఇన్కమ్ వేరే లెవెల్ లో ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇలా చూస్తే దాదాపు ఇప్పటికే దేవర రూ.500 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి రిలీజ్ అవ్వకముందే ఈ రేంజ్ లో కలెక్షన్లు సాధించడం అంటే అది సాధారణ విషయం కాదు. దేవర సినిమా బెనిఫిట్ షోలకు సంబంధించిన టికెట్లతోనూ రికార్డులు క్రియేట్ చేస్తుంది. రూ.1000 టికెట్ అయినప్పటికీ.. బెనిఫిట్ షోలో టికెట్లు హార్ట్ కేకుల అమ్ముడుపోతున్నాయట.