స్టార్ హీరో చియాన్ విక్రమ్ కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలెంటెడ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విక్రమ్.. వైవిద్యమైన పాత్రలను ఎంచుకుంటూ.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. అయితే నటనకు మాత్రమే పరిమితం కానీ ఈ హీరో.. పలు సినిమాలకు ప్లే బ్యాక్ సింగర్‌గాను వ్యవహరించి సత్తా చాటుకున్నాడు. అయితే కేరీర్ స్టార్టింగ్ లో విక్రమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను వ్యవహరించాడు. ఇలా తనలోని టాలెంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా బయటపెట్టాడు. కెరీర్ మొదట్లో విక్రమ్ టీవీ కమర్షియల్ యాడ్ ల కోసం మోడల్గా పనిచేశాడు. కాస్టింగ్ డైరెక్టర్ల దృష్టిలో పడాలని ఆశతో ఒక షార్ట్ ఫిలిం లో కూడా నటించి మెప్పించాడు. దూరదర్శన్ సీరియల్ గలట్టా కుటుంబం తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రయోగాత్మక సినిమా ఎన్ కాదల్ కణ్మనిలో హీరోగా అవకాశాన్ని దక్కించుకున్నాడు.
ఈ సినిమాలో విక్రమ్, రేఖానంబియా జంటగా మెప్పించారు. అయితే సినిమా ఊహించిన సక్సెస్ కాలేదు. తర్వాత కూడా విక్రమ్ నటించిన పలు సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి. అయినా స్ట్రాంగ్ గా నిలబడి మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నించిన విక్రం.. 1999లో వచ్చిన సేతు సినిమాతో కాస్త ఫామ్ లోకి వచ్చారు. అంతకు ముందు వరకు సినిమాలేవి పెద్దగా ఆడక పోవడంతో డబ్బులు కూడా ఆయనకు ఇచ్చేవారు కాదట. ఇక చేసేదేమీ లేక డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను మారిన విక్రమ్ కెరీర్ స్టార్టింగ్‌లో 1993లో అజిత్ హీరోగా తెరకెక్కిన అమరావతి సినిమాలో అజిత్ కు డబ్బింగ్ చెప్పారట. అదే టైంలో వెంకటేష్ క్షణక్షణం మూవీ తమిళ్ డబ్బింగ్ లో వెంకటేష్ పాత్రకు కూడా ఆయన డబ్బ్ చేశారు. ప్రేమదేశం మూవీ హీరో వినీత్ కి కూడా ఆయన గాత్రం అందించాడు. తమిళ సినిమాలో జయరాం, ప్రభుదేవా, అర్జున్, అబ్బాస్, జేడి చక్రవర్తి ఇలా ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలకు డబ్బింగ్ చెప్పిన విక్రమ్.. తమిళ్లో బాగా మాట్లాడతాడు.
అతని వాయిస్ హీరోలకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అందుకే విక్రమ్ చేతనే తమిళ్ సినిమాల్లో హీరోలకు డబ్బింగ్ చేపించేవారు. ముఖ్యంగా అబ్బాస్ కి చాలా సినిమాల్లో విక్రం వాయిస్ అందించడం విశేషం. 2001 వరకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా విక్రమ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. 2024లో ఏఆర్ఎం అనే మలయాళ సినిమాకు నరేటర్ గాను పనిచేశారు. ఇక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వ్యవహరిస్తున్న క్రమంలో శంకర్ లాంటి టాలెంటెడ్ దర్శకులతోను విక్రమ్‌కు పరిచయం ఏర్పడింది. అలా డైలాగ్స్ ఎలా చెప్పాలో.. డబ్బింగ్ ఎంత కీలకమో అతను అర్థం చేసుకున్నడట. డబ్బింగ్ వల్ల అతను ఆర్థిక ఇబ్బందులు లేకుండా నిలబడగలిగాడు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పని చేయడం విక్రమ్ కెరీర్‌లో చాలా పెద్ద ప్లస్ అని చెబుతూ ఉంటారు. ఇప్పటికీ హీరో డబ్బింగ్ పై చాలా ఫోకస్ పెట్టి తన సినిమాలకు అద్భుతంగా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటారు.