కూతుర్ని వ్యభిచారిగా మార్చిన కన్నతల్లి.. కట్ చేస్తే ఆ కూతురే తెలుగు స్టార్ హీరోయిన్..

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లు ఎదిగిన వారందరిది ఎప్పుడు హ్యాపీ లైఫ్ అని.. లగ్జరీ లైఫ్ లీడ్‌ చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారని అంత భావిస్తారు. అయితే అందరూ అనుకున్నట్లుగా ఆ స్థానం అంత సులువుగా దక్కదు. అందరి జీవితం మిద‌టి నుంచి పూల పాన్పు కాదు. కొంతమంది జీవితాల్లో ముళ్లపాన్పులు కూడా ఉంటాయి. అలా సౌత్ ఇండస్ట్రీలో సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఓ హీరోయిన్‌ది కూడా కఠినమైన జీవితమే. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..? అసలు ఏం జరిగిందో..? ఒకసారి తెలుసుకుందాం.

shakeela - Telugu Lives - Telugu Latest News

ఆ అమ్మడు మరెవరో కాదు షకీలా. ఒకప్పుడు భారీ క్రేజ్‌తో హీరోయిన్గా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న షకీలా ఏ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుందో చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సినిమాలను సైతం షకీలా సినిమా వస్తుందంటే పోస్ట్ పన్‌ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంతటి తిరుగులేని ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు అప్పట్లో యూత్‌ను షేక్ చేసేసింది. పోస్టర్ పై షకీలా కనిపిస్తే చాలు.. ఎంత పెద్ద పనులు ఉన్నా పక్కన పడేసి మరి సినిమాలకు ఎగబడిపోయి వెళ్లేవారు ఆడియన్స్.

ఇక షకీలా సినిమా రిలీజ్ అవుతుందంటే.. వారం ముందు, వారం తర్వాత కూడా ఏ సినిమాలు రిలీజ్ చేయడానికి సిద్ధపడేవారు కాదు మేకర్స్. షకీలాతో కోట్ల లాభాలు పొందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చాలామంది ఉన్నారు .అంతటి స్టార్డం ఉన్న ఈ అమ్మడు తన చిన్నతనంలో ఎన్నో కష్టాలను అనుభవించింది. సొంత తల్లి తన పాలిట శత్రువుగా మారిందని షకీలా స్వ‌యంగా వివరించింది. చిన్నతనం నుంచి షకీలా ఇంట్లో డబ్బులు సమస్య ఉండేదని.. అంతేకాదు తను చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చింది.

రాజకీయాల్లోకి షకీలా | actress-shakeela-joins-congress

చిన్నప్పటి నుంచి తన బాడీ పెద్దగానే ఉండేదని.. స్కూల్ చదివే సమయంలో కాలేజ్ వయస్సు ఉన్న అమ్మాయిలా ఉండేదాన్ని.. దాంతో రోడ్డు మీద వెళ్తుంటే అందరూ తనని చూసేవాళ్ళు అంటూ వివరించింది. తన అందం చూసి కన్నతల్లి తనను డబ్బు సంపాదించే సాధనంగా మార్చేసిందని.. తనను చాలామంది మగవాళ్ళకు పరిచయం చేసిందని.. వాళ్ల గదికి తీసుకువెళ్లి నన్ను పడుకోబెట్టేదని.. అందుకు నేను ఒప్పుకునేదాన్ని కాద‌నీ.. దీంతో ఆమె నన్ను విపరీతంగా కొట్టేదంటూ చెప్పుకొచ్చింది. ఇక వేరే మార్గం లేక ఆమె తల్లి చెప్పినట్లు నడుచుకునేదానంటూ వివరించింది.

Shakeela: మాజీ శృంగార తార షకీలా కుమార్తెను చూశారా.. ఎంత అందంగా ఉందో –  News18 తెలుగు

ఇక అలా అలవాటు అయ్యాక సినిమాల్లోకి వచ్చానని ఇండస్ట్రీలో కూడా తన బాడీ మాత్రమే చూసేవారు కానీ.. తన న‌టన‌ను ఎవరో చూసేవారు కాదంటూ వివరించింది. అలా చిన్నతనంలోనే తల్లి కారణంగా వ్యభిచారిగా మారానంటూ వివరించిన షకీలా.. తెలుగులోను ప‌లు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. చివరగా కొబ్బరి మట్ట సినిమాలో కనిపించిన ఈ అమ్మడు.. గతేడాది బిగ్ బాస్ సీజన్ 7లో కంటిస్టెంట్గా వ్యవహరించింది. ఇక ప్రస్తుతం షకీలా లైఫ్ స్టోరీ తెలిసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. నిజంగానే ఇలాంటి తల్లులు కూడా ఉన్నారా.. ఇలాంటి వాళ్లను అస్సలు సహించకూడదు అంటూ.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.