మెగా , అల్లు దెబ్బకు అక్కినేనికి కొత్త తలనొప్పి.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ లో మెగా, అల్లు, అక్కినేని ఫ్యామిలీ లకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ మూడు కుటుంబాల సెల‌బ్రెటీల‌కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉంది. అయితే తాజాగా మెగా, అల్లు ఫ్యామిలీల దెబ్బకు.. అక్కినేని ఫ్యామిలీకి పెద్ద తలనొప్పి వచ్చి పడిందంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు మ్యాటర్ ఏంటో.. ఏం జరిగిందో.. ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం నాగచైతన్య తండేల్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కార్తికేయ 2 లాంటి పానీ ఇండియన్ బ్లాక్ బస్టర్ అందించిన డైరెక్టర్ చందు మండేటి డైరెక్షన్లో తండేల్ సినిమా తెర‌కెక్కుతుంది. ఏపీకి చెందిన ఎంతో మంది జాలర్లు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లి.. అనుకోకుండా పాకిస్తాన్ బోర్డర్లో చిక్కుతారు.

naga chaitanya Thandel Movie release on dasara | Vaartha

అక్కడ పాకిస్తాన్ నేవీ ద‌ళం వాళ్లను అరెస్ట్ చేయడం.. అక్కడి నుంచి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు.. వారి నుంచి ఎలా తప్పించుకున్నారు.. అనే లైన్‌తో ఈ సినిమా రూపొందుతుంది. లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగచైతన్య, సాయి పల్లవి కలిసి మరోసారి సినిమాలో నటించనున్నారు. ఇక తండేల్‌ గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాతాలు అరవింద్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. దాదాపు 75 కోట్ల భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా.. వాస్తవానికి డిసెంబర్ 6న రిలీజ్ కావాలి. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ వచ్చి పడింది. ఈ మూవీ నిర్మాతగా వ్యవహరిస్తున్న అల్లు అరవింద్ కొడుకు.. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా రిలీజ్ కూడా అదే నెల‌లో ఉంది. దీంతో సినిమా రిలీజ్ డేట్ ను మార్చేయాలని తండేల్ మేకర్స్ బావించార‌ట.

Tough times ahead for Pushpa 2 and Game Changer | Latest Telugu cinema news  | Movie reviews | OTT Updates, OTT

ఈ వార్తలపై రీసెంట్గా ఆయ్ సక్సెస్ మీట్ లో గీత ఆర్ట్స్ నిర్మాత బన్నీవాస్ రియాక్ట్ అయ్యాడు. తండేల్‌ మూవీ షూటింగ్ మొదటి నుంచి ప్లానింగ్ ప్రకారం జరుగుతుందని.. ముందు డిసెంబర్లో రిలీజ్ అని భావించాం అయ్యితే అదే నెలలో పుష్ప 2, గేమ్ చేంజర్‌ రిలీజ్ కానున్నాయి. అంతేకాదు తండేల్‌ మూవీ సముద్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్ కు సంబంధించిన సీజీ వర్క్ చాలా ముఖ్యం. ఆ సిజీ వర్క్ పై ఇంకా పని చేస్తూనే ఉన్నాం. ఈ వ‌ర్క్ విషయంలో కంపెనీలు ఏం చెప్తాయో అనే దాన్నిబట్టే.. తండేల్‌ రిలీజ్ డేట్ ఫిక్స్ అవుతుంది అంటూ బన్నీ వాస్ చెప్పుకొచ్చాడు. దసరా తర్వాతే తండెల్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వగలమంటూ వివరించాడు. ప్రస్తుతం బన్నీ వాస్‌ చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ అవ్వడంతో.. అసలు మ్యాటర్ అల్లు, మెగా హీరోలా సినిమాలు రిలీజ్ కానున్న క్ర‌మంలో.. అక్కినేని హీరో సినిమాను పోస్ట్ పోన్ చేసేందుకే ఇలాంటి సాకులు చెబుతున్నారని కామెంట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు.