టాలీవుడ్ స్టార్ హీరోలుగా రాణిస్తూ ఎంతోమంది దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో కొంతమంది హీరోలు పేరుకు మాత్రమే స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నా.. చాలా సాధారణంగా అనిపించే చిన్న చిన్న పనులను కూడా చేయలేకపోతుంటారట. ఒక మనిషి అన్ని పనులు చేయడం సాధ్యం కాదు. కనుక కొన్ని పనులు హీరోలైనా చేయకపోవడం సాధారణమే. కానీ ఈ స్టార్ హీరోలు చేయలేని ఆ పనులేంటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ పనులు ఏంటి.. అ స్టార్ హీరోలు ఎవరో.. ఒకసారి చూద్దాం.
మహేష్ బాబు:
సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు.. తెలుగులో ప్రస్తుతం ఎలాంటి క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మహేష్.. ఐదు పదుల వయసులోనూ హ్యాండ్సమ్ లుక్ తో యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు. ఇక మహేష్ తెలుగు హీరోఅయినా తమిళనాడు చెన్నైలో జన్మించారు. అక్కడే పెరిగాడు. బ్యాచిలర్ డిగ్రీ కూడా అక్కడే పూర్తి చేశారు. దీంతో పుట్టడం, చదువుకోవడం, పెరగడం అంతా చెన్నైలో జరిగింది. అలా తెలుగు రాయడం, చదవడం మహేష్ నేర్చుకోలేకపోయాడట. అప్పట్లో తమిళ్ రాయడం, చదవడం నేర్చుకున్నాను కానీ.. తెలుగు మాత్రం ఇప్పటికి రాదంటూ మహేష్ ఓ సందర్భంలో స్వయంగా వివరించాడు.
నాచురల్ స్టార్ నాని:
నాచురల్ స్టార్ నాని ఎలాంటి టాలెంటెడ్ యాక్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదట ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాని.. పలు సినిమాలుకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఈ క్రమంలో సినిమా అవకాశాలను దక్కించుకున్న ఈయన.. ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తూ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. అయితే నాని ఇప్పుడు సాధారణ జనాలు కూడా ఉపయోగిస్తున్న డిజిటల్ పేమెంట్ ఆప్స్.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యాప్లను ఎలా వాడాలో తెలియక చాలా ఇబ్బంది పడతారట. వాస్తవానికి వాటిని ఉపయోగించడం చాలా సులభమని అందరికీ తెలుసు. అయినా కొన్ని సందర్భాల్లో నాని డిజిటల్ పేమెంట్స్ చేయలేకపోయారట. నాని మొబైల్ ఫోన్ బాగా యూస్ చేస్తూ ఉంటారు. కానీ కొత్త టెక్నాలజీలను అందరిలాగా స్పీడ్ గా అర్థం చేసుకోలేను అంటూ వివరించారు.
రానా దగ్గుపాటి:
దగ్గుపాటి ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా.. కథలో కంటెంట్ ఉందనిపిస్తేనే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడానికి కూడా సిద్ధపడుతూ ఉంటాడు. ఇక బాహుబలిలో బాలనటిగా నటించి ఒకసారిగా పాన్ ఇండియా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈయన ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే రానాకు అసలు బైక్ నడపడమే రాదు అంటూ చెప్పి ఆడియన్స్ కు షాక్ ఇచ్చాడు. సాధారణంగా స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ప్రతి ఒక్క హీరో కూడా తమ సినిమాల్లో స్టైలిష్ బైక్ రైడ్ చేస్తూ ఆకట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. హీరోయిన్‌లను బైక్ పై ఎక్కించుకొని తీసుకువెళ్లే సీన్స్ కూడా చాలా తెరకెక్కుతూ ఉంటాయి. సినిమాల్లో ఏదో సందర్భంలో ఖచ్చితంగా హీరో బైక్ నడపాల్సిన అవసరం ఉంటుంది. కానీ రానా మాత్రం హీరోగా ఎన్ని సినిమాలు నటించినా.. ఇప్పటివరకు బైక్ రైడింగ్ నేర్చుకోకుండానే రాణిస్తున్నాడు. ఇలా ప్రస్తుతం ఈ ముగ్గురు స్టార్ హీరోస్‌కు రాని చిన్న చిన్న పనుల గురించి తెలుసుకున్న నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.