టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బాలనటుడిగా పలు సినిమాలో నటించి మెప్పించాడు. తర్వాత సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా మంచి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు. తన నటనతో తాతకు తగ్గ తనయుడిగా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న తారక్ రాజకీయాలకు మాత్రం దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
మొదట్లో ఎన్టీఆర్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచార కార్యక్రమాలను నిర్వహించిన తర్వాత అయినా తెలుగుదేశం పార్టీకి దూరమవుతూ వచ్చాడు. ఈ క్రమంలో టిడిపి నేతలు కావాలని తారక్‌ను దూరం పెడుతున్నారని.. ఎన్టీఆర్ కు నిజమైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అంటూ తారక్ ఫ్యాన్స్ అంతా నెటింట రచ్చ రచ్చ చేశారు. ఇప్పటికీ తారక్ ఫ్యాన్స్ చాలా మంది ఇలాంటి అభిప్రాయాల్లో సోషల్ మీడియా వేదికదా వ్యక్తం చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో తాజాగా తెలుగుదేశం పార్టీ నేత బుద్ధ వెంకన్న ఓ ఇంటర్వ్యూలో వీటిపై స్పందించాడు. ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సంచాలనగా మారాయి.
తాజాగా వెంకన్న మాట్లాడుతూ.. నేను టిడిపిలోనే కొనసాగుతున్నా. చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాన్ష్ గారి నాయకత్వంలో పనిచేయడానికి రెడీగా ఉన్నా. కానీ నేను ఎన్‌టీఆర్‌కి మాత్రం సపోర్ట్ చేయనంటూ చెప్పుకొచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ రామారావు గారికి మనవడే కావచ్చు.. కానీ ఆయన ఒక్కడే మానవుడు కాదు కదా. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నారా లోకేష్ కూడా ఎన్టీఆర్కు మనవడే అవుతారు. ఆయన పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేశారు అంటూ.. ఎన్టీఆర్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బుద్ధ వెంకన్న పై ఫైర్ అవుతున్నారు. నీ సపోర్ట్ ఎవరికి కావాలి బే అంటూ.. మా అన్న రాజకీయాల్లోకి వస్తే సపోర్ట్ చేయడానికి చాలామంది ఉన్నారు.. నీలాంటి వాళ్లను అసలు పట్టించుకోము అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.