నేను అల్లు అరవింద్ కొడుకుని.. షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన నటుడు..!

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఏవో ఒక సంఘటనలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక కొంతమంది నటులు సాధారణంగా మాట్లాడే మాటలు కూడా వివాదస్పదంగా మారి నెటింట‌ హల్చల్ చేస్తూ ఉంటాయి. అలా తాజాగా ఓ నటుడు మాట్లాడిన మాటలు నెటింట‌ తెగ వైరల్‌గా మారుతున్నాయి. అల్లు అరవింద్ మా నాన్న, అల్లు అర్జున్ మా అన్నయ్య అంటూ ఆయన చేసిన కామెంట్స్ నెటింట‌ తెగ ట్రెండింగ్‌గా మారాయి. ఇంతకీ అతను ఎవరో.. అతనికి అల్లు అర‌వింద్‌కు మధ్యలో ఉన్న సంబంధం ఏంటి.. నిజంగానే అల్లు అరవింద్ కు అతను కూడా ఓ కొడుకేనా అనేది ఒకసారి తెలుసుకుందాం. సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాళ్లు ఇండస్ట్రీలో రాణించాలని ఆశల‌తో అడుగు పెడుతుంటారు. కొంతమంది ఫెడౌట్‌ అయిన సెలబ్రిటీస్ ఇండస్ట్రీకి దూరమై వెళ్ళిపోతూ ఉంటారు. ఇండస్ట్రీ అనేది తెరిచిన తలుపు లాంటిది. ఇక ఇప్పటికే ఎంతోమంది నటీనటులు, డైరెక్టర్లు, కొరియోగ్రాఫర్లు ఇండస్ట్రీకి అడుగు పెట్టారు.

Allu Aravind | అల్లు అర్జున్‌ను చూసి గర్వపడుతున్నా : అల్లు  అరవింద్‌-Namasthe Telangana

కాగా ఇటీవల నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్ పై.. కమిటీ కుర్రాళ్ళు సినిమా నిర్మించి ఇందులో చాలా మంది కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ కూడా అయింది. అలాగే మరో కొత్త సినిమా వెండితెరపై ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతుంది. అదే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. ఈ సినిమా ఆగస్టు 23న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీలో నటించిన అంకిత్ కొయ్య‌ కామెంట్స్ చేశాడు. ఆయన ఇంటర్వ్యూలో సినిమాపై రియాక్ట్ అవుతూ.. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే.. అల్లు అరవింద్ మా నాన్న, xమా అన్నయ్య అనే టైప్ లో ఆలోచనలు ఉంటాయని చెప్పుకొచ్చాడు. ఇక ఈ మూవీలో చిన్నప్పటి నుంచి నువ్వు మా అబ్బాయివి కాదు.. ఎక్కడి నుంచో నిన్ను తీసుకొచ్చాం.. అంటూ ఇంట్లో వాళ్ళు ఆటపట్టిస్తారని.. అయితే అలా పెరిగిన నేను నన్ను మా ఇంటికి ఎప్పుడు పంపిస్తావ్ అంటూ రావు రమేష్ గారిని అడుగుతానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఇక నిహారిక పింక్ ఎలిమెంట్స్ బ్యానర్ గురించి ఆయన మాట్లాడుతూ.. ఆ బ్యానర్ పై వచ్చే స్టోరీలు అన్నింటిని నేను ఫిల్టర్ చేసి వారికి మళ్ళీ పంపిస్తూ ఉంటా.. అయితే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీలో అవకాశం వచ్చినప్పుడు ఆ మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ కార్యా.. నన్ను ఈ మూవీలో ఛాన్స్ మిస్ చేసుకోకూడదని వివరించారని.. అందుకే ఈ సినిమాలో నటించానంటూ చెప్పుకొచ్చాడు. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీలో రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించడం.. అంకిత్ కొయ్య ఆయన కొడుకుగా కనిపిస్తారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. కాగా అంకిత్ కొయ్య.. నేను అల్లు అరవింద్ కొడుకును, అల్లు అర్జున్ మా అన్నయ్య అని మాట్లాడిన కామెంట్స్‌ తెగ వైరల్ గా మారడంతో.. ఏంటి తెరపైకి అల్లు అరవింద్ కొత్త కొడకా.. నిజంగానే అల్లు అర్జున్ ఆయనకు అన్నయ్య అంటూ.. సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలు పెట్టారు.