టిలావుడ్ స్టార్ హీరోయిన్ సమంత – నాగచైతన్య ఒకరిని ఒకరు ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత.. నాలుగేళ్ల వైవాహిక జీవితానికి చెక్ పెడుతూ మనస్ఫూర్తిగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎవరి కెరీర్‌లో వాళ్ళు బిజీగా గడుపుతున్నారు. అయితే విడిపోయిన తర్వాత నాగచైతన్య.. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నాడంటూ చాలా రోజులు వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు సమంత కూడా రాజ్ నిడమూరు అనే వ్యక్తితో డేటింగ్ చేస్తుందంటూ ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో నాగచైతన్య పై వస్తున్న రూమర్స్ ను నిజం చేస్తూ చైతు.. శోభిత ధూళిపాళ్లను ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ బిగ్ షాక్ ఇచ్చాడు.
ఇప్పుడు సమంతపై రూమర్ కూడా నిజం కావచ్చు అంటూ టాక్ నడుస్తుంది. సమంతని ఫ్యామిలీ మెన్ సిరీస్ తో బాలీవుడ్‌కు పరిచయం చేసిన రాజ్ అండ్ డీకే.. దర్శక,నిర్మాతలు ఇద్దరు పలు సినిమాలు.. సిరీస్‌లు నిర్మిస్తూ ఉంటారు. వీరిలో రాజు నిడమర్రుతో సమంత డేటింగ్ చేస్తుందంటూ టాక్ నడుస్తుంది. ఇక నాగచైతన్య.. శోభిత ఎంగేజ్మెంట్ నెటింట తెగ వైరల్‌గా మారడంతో.. మరోసారి సమంత – నాగచైతన్యకు సంబంధించిన న్యూస్ ఆసక్తిగా మారింది. సమంతతో విడిపోయే ముందు నాగచైతన్య.. అక్కినేని ఫ్యామిలీ ఆమెకు ఎన్ని కోట్లభరణం ఇచ్చి ఉంటారు.. అనే ప్రశ్న ప్రేక్షకుల్లో మొదలైంది.
ఇక గతంలో.. చైతు, శ్యామ్ విడాకులతో అక్కినేని ఫ్యామిలీ నుంచి సమంతకు రూ.200 కోట్ల భరణం అందిందని టాక్. దీనిపై రీసెంట్గా సమంత ఓ పాపులర్ బాలీవుడ్ టాక్ షోలో రియాక్ట్ అయింది. ఆమె మాట్లాడుతూ అవును నిజమే.. నా మాజీ భర్తతో విడిపోవడానికి నేను ఆయన నుంచి రూ.250 కోట్లు అప్పు తీసుకున్నా.. అందుకే ప్రతి ఉదయం నేను ఇన్కమ్ టాక్స్ అధికారుల కోసం మా ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నా.. కనీసం వాళ్లకైనా నేను నిజా నిజాలు చూపించగలుగుతా అంటూ సెటైరికల్ సమాధానం చెప్పింది. ఇకపోతే గత కొంతకాలం నుంచి సినిమాలు దూరంగా ఉంటూ రెస్ట్ తీసుకుంటున్న శ్యామ్.. త్వరలోనే మళ్లీ షూటింగ్స్ లో బిజీ కానుందట. ఇక ఏడాది క్రితం అమ్మే నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.