ఓరి దేవుడా.. ఆ ఫ్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన రామ్.. ఎనర్జిటిక్ స్టార్ హ్యాట్రిక్ కొట్టినట్టే పో..!

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం హ్యాట్రిక్‌కు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అది హిట్లు కొట్టి కాదులేండి. ఫ్లాప్స్ తో. తాజాగా రామ్ రెండో సారి కూడా ఫ్లాప్ చివి చూసిన సంగతి తెలిసిందే. రామ్ నుంచి చివరిగా వచ్చిన వారియర్స్, స్కంద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తర్వాత వచ్చిన డబల్ ఇస్మార్ట్.. కాస్త యావరేజ్‌గా అనిపించినా.. ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. దీంతో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు తన ఖాతాలో వేసుకున్న రామ్.. మాస్ మూవీస్ పై ఉన్న ఇంట్రెస్ట్‌తో తన స్ట్రాంగ్ జోన్‌ వదిలేసి.. ఫ్లాప్ సినిమాల బాటపట్టాడు. రామ్ లాస్ట్ మూడు సినిమాలు వేటికవే పోటీపడి ఫ్లాపులుగా నిలిచాయి.

ఇక రామ ఫ్లాప్ మూవీ వారియర్స్ తమిళ్ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో వ‌చ్చింది. దాదాపు ఏడేళ్ల క్రితం బన్నీ హీరోగా తెర‌కెక్కాల్సిన‌ ఈ సినిమాను బన్నీ రిజెక్ట్ చేయడంతో.. రామ్ నటించి దారుణమైన ఫ్లాప్ ను చెవి చూశాడు. అసలు అలాంటి డైరెక్టర్ తో సినిమాకు రామ్ ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఆయనకే తెలియాలి. ఇక రెండో సినిమా స్కంధ‌. భారీ యాక్షన్ సినిమాల డైరెక్టర్ బోయపాటి శ్రీను క్యారఫ్ అడ్రస్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే బోయపాటి సినిమాలో రామ్ వయసుకు మించిన పాత్రలో నటించి ఫ్లాప్ అందుకున్నాడు. ఇక తాజా మూవీ డబల్ ఇస్మార్ట్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. రెండో రోజు ధియేటర్లు ఖాళీ అయిపోయాయి.

South News | Harish Shankar Confirms His Next Film Will Be With Ram  Pothineni | 🎥 LatestLY

దీన్ని బట్టి డబల్ ఇస్మార్ట్ ఎలాంటి టాక్ తెచ్చుకుందో అర్థం చేసుకోవచ్చు. అయితే గతంలో నేను శైలజా, రెడీ, దేవదాసు లాంటి లవర్ బాయ్ రోల్స్ లో నటించిన రామ్.. ఒక్కసారిగా మాస్ యాంగిల్‌లో చూపించిన‌ ప్రేక్షకులకు అది ఎక్కలేదు. ఈ క్రమంలో హ్యాట్రిక్ ఫ్లాప్‌లు అందుకున్న రామ్.. మరోసారి తాజాగా మిస్టర్ బచ్చన్ తో ఫ్లాప్ అందుకున్న హరీష్ శంకర్ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఇప్పటికైనా మేల్కొని పెద్దల సూచనలు ప్రకారం కథ‌లు ఎంచుకుంటే బాగుంటుంది. లేదంటే ఇండస్ట్రీలో ఫ్లాప్ స్టార్ గా మిగిలిపోయే అవకాశలు ఉన్నాయి దీందో రామ్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఇక ముందు ముందు రామ్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు వేచి చూడాలి.