టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సమంతకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం, అభినయంత లక్షలాదిమంది అభిమానాన్ని దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సేవా కార్యక్రమాల్లోనూ యాక్టివ్ గా ఉంటూ ఎంతోమంది ప్రశంసలు అందుకుంది. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సొంత కష్టంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకోవడం అంటే సాధారణ విషయం కాదు. అయితే సినిమాల పరంగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నా.. పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను చూసిన సమంత.. తన మొదటి సినిమా ఏమాయ చేసావే సినిమా షూట్ టైంలోనే.. ఆ మూవీ హీరో అక్కినేని నాగచైతన్య తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే.
వీరిద్దరి వివాహమైన నాలుగేళ్ల తర్వాత ఏవో మనస్పర్ధలతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఇక వీర డివర్స్ తర్వాత సమంతకు సినీ కెరీర్ కూడా ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందలేదు. అలాగే పర్సనల్ లైఫ్ లోను మయోసైటిస్ భారినపడి ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరమైంది. ఇలాంటి క్రమంలో తాజాగా సమంత మాజీ భర్త నాగచైతన్య, శోభితను ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే విరు వివాహం చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో సమంత, నాగచైతన్య ఎంగేజ్మెంట్‌తో కాస్త బాధ పడిందని వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా సమంత మరో సంచల నిర్ణయం తీసుకుందంటూ.
ఓ న్యూస్ నెటింట తెగ వైరల్ గా మారుతుంది. సమంత తల సినీ కెరీర్‌లో లక్షలు కూడబెట్టిన సంగతి తెలిసిందే. అంతే కాదు సోషల్ మీడియా పోస్టులు.. ప్రమోషన్స్ ద్వారా కూడా కోట్లలో సంపాదిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. పలు బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తూ ఆదాయాన్ని గడిస్తుంది. వీటన్నిటి ద్వారా వచ్చిన డబ్బులు.. సమంత ఇప్పటివరకు సంపాదించిన ఆస్తుల్లో 60 శాతం వాటాను అనాధ పిల్లలకు డొనేట్ చేయాలని నిర్ణయం తీసుకుందట. ఈ విషయం తెలిసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా సమంత అనాధల గురించి ఆలోచించడం అంటే సాధారణ విషయం కాదని.. నిజంగా ఈమె చాలా గ్రేట్ అంటూ శ్యామ్ బంగారం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.