“నా ఆ కోరిక ఇంకా తీరలేదు” ..ఓపెన్ గానే చెప్పేసిన కృతిశెట్టి..!!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు . ఎలా అంటే ఫలానా హీరో సినిమాలో అవకాశాలు రావాలి అంటే కచ్చితంగా ఏదో ఒక ఇంటర్వ్యూలో ఆ హీరోని పొగడాల్సిందే . అప్పుడే ఆ హీరో తాలూకా వాళ్ళు ఆ ఇంటర్వ్యూ చూసి పలానా హీరోయిన్ కి మీరంటే ఇష్టం .. మీతో నటించాలి అనుకుంటుంది అని .. ఆ కబురును చల్లగా వేరే వాళ్ల వద్దకు చేరుస్తారు . ఇది ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయిపోతుంది. చాలామంది హీరోయిన్స్ పరోక్షకంగా ఆఫర్లు రావడానికి ఇలా చేస్తున్నారు.

తాజాగా అదే స్ట్రాటజీని ఫాలో అయ్యింది కృతశెట్టి. తెలుగు ఇండస్ట్రీలో ఉప్పెన సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు తనదైన స్టైల్ లో కోలీవుడ్లో రాజ్యమేలుస్తుంది . ఆఫ్ కోర్స్ తెలుగులో పెద్దగా చెప్పుకో తగిన అవకాశాలు అందుకోలేకపోతున్న కోలీవుడ్లో మాత్రం మంచి సినిమాలను పట్టేస్తుంది . రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కృతి శెట్టి సంచలన కామెంట్స్ చేసింది.

కృతి శెట్టి మాట్లాడుతూ ..”సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక ఎలాంటి రోల్స్ లోనైనా నటించాలి ఒప్పుకుంటాను ..కానీ నాకు ఫుల్ టు ఫుల్ యాక్షన్ జోనర్ మూవీ ఒక సినిమా చేయాలని ఉంది ..చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాను ఇంకా నాకు ఆ కోరిక తీరలేదు ..అలాంటి సినిమా వస్తే అసలు మిస్ చేసుకోను ..ఈలోపు ఎలాంటి సినిమాలు అయినా సరే మనసుకు కథ నచ్చితే కచ్చితంగా చేస్తాను ..నా వయసుతో అస్సలు సంబంధం లేకుండా నటించమన్నా నటిస్తాను “అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది . ఇలా కృతి పాప బోల్డ్ గా తన మనసులోని కోరికను బయట పెట్టడం ఫ్యాన్స్ కి సైతం షాకింగ్ గా అనిపిస్తుంది . మరికొందరు నీకు యాక్షన్ సినిమాలు బాగోవు అంటూ చెప్పుకొస్తున్నారు . చూద్దాం మరి కృతి శెట్టి కోరికను తీర్చే ఆ డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడో ..?