“కల్కి” విషయంలో ప్రభాస్ చేస్తున్న అతి పెద్ద తప్పు ఇదే..సరిదిద్దుకోకపోతే భారీ నష్టం తప్పదా..?

ఒక స్టార్ హీరో సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందా..? పెట్టిన దానికి డబుల్ ప్రాఫిట్స్ తీసుకొస్తుందా..? అంటే నో అని చెప్పాలి . ఎంతోమంది స్టార్స్ నటించిన సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. కనీసం పెట్టిన దానికి సగం బడ్జెట్ రాకుండా కూడా పది రోజుల్లోనే సినిమా దొబ్బేసిన మూవీస్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమా తక్కువ బడ్జెట్ సినిమా అంటూ రెండు వ్యత్యాసాలు చూపిస్తున్నారు. కోట్లు భారీ బడ్జెట్ పెట్టిన ప్రాఫిట్స్ రాకపోతే తక్కువ బడ్జెట్ పెట్టి ఎక్కువ ప్రాఫిట్స్ సంపాదించుకోవడమే మేలు అంటున్నారు డైరెక్టర్లు .

ప్రజెంట్ ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రభాస్ కల్కి కి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది . కల్కి విషయంలో ప్రభాస్ పెద్ద తప్పు చేస్తున్నాడు అంటున్నారు సినీ విశ్లేషకులు . తన పాన్ ఇండియా స్టేటస్ చూసి ప్రభాస్ కల్కి ప్రమోషన్స్ కోసం కోట్లు కోట్లు ఖర్చు చేస్తున్నారు అని .. అది కచ్చితంగా బెడిసి కొడుతుంది అని ప్రమోషన్స్ నిర్వహించడం ఇంపార్టెంట్ కాదు ప్రమోషన్స్ లో ఏమాత్రం జనాలను అట్రాక్ట్ చేసాము అన్నదే ఇంపార్టెంట్ ..సినిమాకి సంబంధించిన విషయాలు కాకుండా పర్సనల్ లైఫ్ సంబంధించిన విషయాలను ఎక్కువగా ప్రస్తావించడం కూడా సినిమాకి నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అని హెచ్చరిస్తున్నారు సినీ విశ్లేషకులు.

మనకు తెలిసిందే ప్రభాస్ కల్కి సినిమాలో బుజ్జి ని ఇంట్రడ్యూస్ చేయడానికి గాను ఏకంగా 40 కోట్లు ఖర్చుపెట్టి ఒక ఈవెంట్ చేశారు. ఆ ఈవెంట్ కు ముందు ప్రభాస్ స్పెషల్ పర్సన్ రాబోతుంది అంటూ ఓ పోస్ట్ చేశారు. ఇది సినిమా ప్రమోషన్స్ కి బిగ్ మైనస్ గా మారింది. ప్రభాస్ తన సినిమా కోసం పర్సనల్ లైఫ్ ని వాడుకుంటారా..? అసలు ఈ పనికిమాలిన చెత్త సలహా ఇచ్చింది ఎవరు..?? అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . ఇప్పుడు అదే ప్రభాస్ కల్కి సినిమాకు భారీ బొక్క పడేలా చేయబోతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు..!!