ఓరి దేవుడోయ్.. ఏంటి ఇది.. కల్కి సినిమా రిలీజ్ అవ్వకముందే ప్రభాస్ అక్కడికి వెళ్లి పోతున్నాడా..? డార్లింగ్ టు నాటి ఫెలో..!

ఎస్ డార్లింగ్ ప్రభాస్ కి సంబంధించిన ఈ న్యూస్ ఇప్పుడు సినీ వర్గాలలో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. మరి కొద్ది రోజుల్లోనే ఆయన నటించిన కల్కి సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా సరే డార్లింగ్ ప్రభాస్ పేరే ఎక్కువగా వినిపిస్తూ వస్తుంది. అయితే ఆయన ఎందుకో ఈ సినిమాకి ప్రమోషన్స్ ఎక్కువగా నిర్వహించలేకపోతున్నాడు. ప్రమోషన్స్ పనుల్లో పాల్గొనలేకపోతున్నాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి .

పైగా మొదటి నుంచి డార్లింగ్ ప్రభాస్ కి సిగ్గు ఎక్కువ ..ఎక్కడికి వెళ్లినా సరిగ్గా మాట్లాడడు .. మొన్న ముంబైలో జరిగిన ఈవెంట్ లోను అస్సలు ప్రభాస్ సరిగా మాట్లాడనే లేదు అన్న కామెంట్స్ వినిపించాయి . అయితే సినిమా రిలీజ్ కి ఇంకా ఐదు రోజులు ఉంది ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద హంగామా చేయడానికి పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు . అయితే డార్లింగ్ ప్రభాస్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా యూరప్ వెళ్ళబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది . సాధారణంగా ప్రభాస్ తన ఏ సినిమా రిలీజ్ అవుతున్న సరే ఇండియాలో ఉండడు .. వెంటనే యూరప్ లేదా విదేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు .

కానీ అది సినిమా రిలీజ్ అయ్యే ఒకటి రెండు రోజులు ముందు కానీ ..కల్కి సినిమా విషయంలో మాత్రం డిఫరెంట్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు . ఏకంగా రిలీజ్ కి ఐదు రోజులు ముందే ప్రభాస్ ఇండియా వదిలేసి యూరప్ కి వెళ్ళిపోతున్నాడు అన్న వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ టెన్షన్ పడిపోతున్నారు . ప్రభాస్ ఈ సినిమా హిట్ అవుతుందన్న ధీమాతో వెళ్తున్నాడా? ఆ టెన్షన్ భరించడం ఎందుకులే అన్న ఉద్దేశపూర్వకంగానే ముందుగానే యూరప్ వెళ్తున్నాడా..? ఏమో దీనిపై ప్రభాస్ కాని కల్కి టీం కాని స్పందిస్తేనే బాగుంటుంది . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా వైరల్ గా మారింది..!!