బాలయ్య సినిమా విషయాంలో బోయపాటి స్ట్రాంగ్ డెసీషన్.. ఈసారి ఆ పని చేయడా..?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే. వీళ్ళ కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి . మూడు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడం గమనార్హం. అయితే వీళ్ళ కాంబోలో రాబోతున్న నాలుగో సినిమాపై హ్యుజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. మరి ముఖ్యంగా అఖండ 2 గా ఈ సినిమా రాబోతుంది అంటూ ఓ వర్గం ప్రేక్షకులు మాట్లాడుతుంటే .. కాదు కాదు కాదు ఇది ఓ రియల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ గా రాబోతుంది అంటూ ప్రచారం చేస్తున్నారు .

కాగా ఈ సినిమాకి సంబంధించి ఏ న్యూస్ లీకైన సరే అభిమానులు ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు . ఎప్పుడు కూడా బాలయ్య బోయపాటి కాంబో అంటే ఊర మాస్ నాటు రేంజ్ డైలాగులు ఉంటాయి . మాస్ పెర్ఫార్మెన్స్ తో బాలయ్య అల్లాడించేస్తాడు ..తొడగొట్టడాలు ..కత్తులతో నరకడాలు ఎక్కువగా చూస్తాం. మరీ ముఖ్యంగా వైలెన్స్ కి కేరాఫ్ అడ్రస్ బోయపాటి సినిమాలు అన్న పేరు ఎప్పటినుంచో ఉంది . అయితే ఈసారి సినిమా విషయంలో మాత్రం బోయపాటి అలాంటి తప్పు చేయదలుచుకోవట్లేదట .

బాలయ్యతో ఫుల్ టు ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ చేయబోతున్నాడట. జనాలకి సమాజానికి ఉపయోగపడే సినిమానే ఈసారి ఆయన బాలయ్యతో తెరకెక్కిస్తున్నారట . అంతేకాదు సీనియర్ అన్న పదానికే కొత్త అర్థం తెచ్చేలా ఈ మూవీలో బాలయ్య లుక్స్ ఉండబోతున్నాయట . రిస్కీ పాత్రలు చేయడంలో బాలయ్య ఎప్పుడు ముందుంటాడు . అందుకే బోయపాటికి మరోసారి ఛాన్స్ ఇచ్చాడు అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు..!