సెన్సేషనల్ బ్యూటీతో విజయ్ దేవరకొండ సినిమా.. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్ ఇది..!

విజయ్ దేవరకొండ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరో ..జనాలు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు . ఆటిట్యూడ్ హీరో అంటూ మరి కొంతమంది పిలుచుకుంటూ ఉంటారు.. విజయ్ దేవరకొండ లాస్ట్ గా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్ . పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది . ఈ సినిమా పై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అభిమానులు . కానీ విజయ్ దేవరకొండ రేంజ్ ఆఫ్ కథ కాదు ఇది అంటూ తేల్చి పడేశారు అభిమానులు .

అందుకే ఈ సినిమా ఫ్లాప్ అయింది. అయితే తన నెక్స్ట్ సినిమాల విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉన్నాడు విజయ్ దేవరకొండ . ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ రవికిరణ్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . అంతేకాదు రవి కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కే విజయ్ దేవరకొండ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నారు . ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అవ్వగానే ఫ్యాన్స్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు . ఈ సినిమా నుంచి తాజాగా ఒక వార్త లీక్ అయి వైరల్ గా మారింది .

ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటించబోతుందట . దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ మరి కొద్ది రోజుల్లోనే రాబోతుందట . ఇది ఫుల్ టు ఫుల్ లవబుల్ రియల్ లవ్ స్టోరీగా తెరకెక్కబోతుందట . నేచురాలిటీ ప్రధానంగా ఈ సినిమాలో చూపించబోతున్నారట . ఈ సినిమా కోసం సాయి పల్లవిని అప్రోచ్ అవ్వగా ..కధ విన్న సాయి పల్లవి ఇంప్రెస్ అయ్యి ఓకే చేసిందట . గతంలో విజయ్ దేవరకొండ సరసన నటించే రెండు అవకాశాలు వస్తే రెండు అవకాశాలను మిస్ చేసుకునేసింది సాయి పల్లవి.. ఈ సినిమాతో ఈ జంట అభిమానులకు మంచి ఫీలింగ్ కలుగజేయబోతుంది. ఈ కాంబో కోసం జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!