పవన్ కళ్యాణ్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన చిరంజీవి.. అనసూయ రియాక్షన్ ఇదే..!

అనసూయ ..ఇండస్ట్రీలో టాప్ యాంకర్ ..అది ఒకప్పటి మాట .. ఇప్పుడు ఇండస్ట్రీలో పలు కీలక పాత్రలో నటించే బ్యూటీ ..ఎటువంటి రోల్స్ అయినా సరే అవలీలగా నటిస్తుంది . తనదైన స్టైల్ లో నటించి మెప్పిస్తుంది. మరీ ముఖ్యంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవుతుంది . తనని ట్రోల్ చేసే వాళ్ళకి ఇచ్చి పడేస్తుంది . అనసూయ గురించి పెద్దగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిన విషయమే.

రీసెంట్గా అనసూయ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనసూయ సోషల్ మీడియాలో నిరంతరం ఆక్టివ్ గా ఉంటుంది . తనదైన స్టైల్ లో ముందుకు వెళుతూ ఉంటుంది . తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ వీడియో పై అనసూయ స్పందిస్తూ..సంచలన కామెంట్స్ చేసింది.

” మా నాయకుడు వచ్చాడు ..ఇది ఆరంభం మాత్రమే ..నిజమైన ప్రేమకు ఇదే నిదర్శనం” అంటూ ఓ రేంజ్ లో పొగిడేసింది . దీంతో సోషల్ మీడియాలో అనసూయ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . చాలామంది పవన్ కళ్యాణ్ చిరంజీవి వీడియో పై పాజిటివ్గా స్పందించారు . కానీ అనసూయ మాటలను మాత్రమే హైలైట్ చేస్తున్నారు కొందరు జనాలు . అది అనసూయ కి ఉన్న క్రేజా ..? లేకపోతే మరేదైనా కారణమా..? అనేది వాళ్లకే తెలియాలి ప్రెసెంట్ అనసూయ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది..!!